యేసు క్రీస్తు ఒక మత్తుమందు కాదు!

ఒక్క నిమిషంలో చదువగిలిగే ఈరోజు వాక్యధ్యానంలో, ఎందుకు యేసు మన ఆత్మలలోనికి ఎక్కించే సత్యం అనే ఇంట్రావీనస్ వంటివాడో తెలుసుకుందాం!


కొన్నిసార్లు మనం ఇతరుల ఆధ్యాత్మిక అవసరతలు పట్టించుకోకుండా, లోకపు నిద్రమత్తుల జోలల్లో ఉండటానికి ఇష్టపడుతుంటాం.


కొంతమంది క్రైస్తవులు కూడా "క్రీస్తును ఒక మత్తుమందులాగా" భావించి, రక్షణ పొందాక వారు కేవలం విశ్రాంతిని, ఉపశమనాన్ని పొందుతూ, పరలోకం చేరేలోపు ఈ ప్రయాణం అంతా "నిద్రపోవటమే" అని అనుకుంటారు.


కాని క్రీస్తు ఒక మత్తుమందు కాదు.


ఆయన మన ఆత్మలలోనికి ఎక్కించే సత్యం అనే ఇంట్రావీనస్ వంటివాడు. ఆ సత్యం :


1. మన మనస్సులు మారుస్తుంది. అప్పుడు, "ఆయన చిత్తమును పూర్ణముగా గ్రహించినవారమై, ఆత్మసంబంధమైన వివేకముతో నింపబడతాము".


2. మన ప్రవర్తనను బలపరుస్తుంది, అప్పుడు "అన్ని విషయములలో ప్రభువును సంతోషపెట్టునట్లు ఆయనకు తగ్గట్టుగా నడుచుకోగలం"


3. మన పట్ల దేవునికి ఉన్న ప్రణాళికలకు స్ఫూర్తినిస్తుంది, అప్పుడు "ఆయన మహిమ శక్తిని కలిగి ప్రతీ సత్కార్యములో సఫలమవుతాము"


అవును! మనం ఎపుడైతే యేసును మనలో పనిచేయడానికి నిజాయితీగా ఒప్పుకుంటామో, అప్పుడు "ఆనందమతో కూడిన పూర్ణమైన ఓర్పును" మనం సంపాదించుకుంటాం. ఆయన నిజంగానే మన ఆత్మలకు ఒక ఇంట్రావీనస్ వంటివాడు.


ఈ పై వచనాలన్నీ కొలస్సీయులకు 1:9-12 నుండి తీసుకున్నవే. ఈ వారమంతా ఈ వచనాలను ఎందుకు ధ్యానించకూడదు?


Jesus is Not a Sedative!


ఒక్క నిమిషంలో చదువగిలిగే ఈరోజు వాక్యధ్యానంలో, ఎందుకు యేసు మన ఆత్మలలోనికి ఎక్కించే సత్యం అనే ఇంట్రావీనస్ వంటివాడో తెలుసుకుందాం!


No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.