పొడవబడ్డాడు గాని విషం ఎక్కించుకోలేదు

ఇది నిజంగా జరిగిన ఒక అద్భుతమైన జీవితకథ. దేవుడు జోక్యం చేసుకోకపోతే, దీని అంతం చాలా విషాదంగా ఉండేది. 💜


చేదు మనలో విషాన్ని ఎక్కిస్తుంది. దానికి విరుగుడు క్షమాపణే.


ఫ్లోరిడా ఎవర్ గ్లేడిస్లో ఒక గుర్తు తెలియని వ్యక్తి, పది సంవత్సరాల క్రిస్ కారియర్ను ఆపహరించి, కత్తితో పొడిచి, ఒక్కడినే వదిలేసి పారిపోయాడు.


తరువాత క్రిస్ చనిపోలేదు గాని కోలుకున్నాడు. కాని కోపం, భయం, క్షమించలేని చేదు అనే పీడకలలతో జీవించడం మొదలుపెట్టాడు.


తనకు పదమూడు సంవత్సరాలు వచ్చినప్పుడు, దేవుడే తన చనిపోకుండా కాపాడాడని అర్ధమయ్యి, ఇంకా పరారీలోనే ఉన్న తనను దాడిచేసిన ఆ వ్యక్తిని క్షమించాడు.


ఇరువై సంవత్సరాల తరువాత :
పోలీస్ నుండి క్రిస్ కు ఒక కాల్ వచ్చింది. నర్సింగ్ హోమ్ లో ఆఖరి రోజుల్లో ఉన్న డేవిడ్ అనే వ్యక్తి క్రిస్ ని అపహరించి, చంపడానికి పొడిచింది తానేనని ఒప్పుకున్నాడని చెప్పారు.


అది విన్న క్రిస్ డేవిడ్ ను క్షమించానని చెప్పడానికి అతన్ని దర్శించడం చూసిన విలేకరులు ఆశ్చర్యపోయారు.


క్రిస్ అంతకన్నా ఎక్కువే చేసాడు : డేవిడ్ చనిపోకముందు అతన్ని చాలా సార్లు దర్శించి, రక్షణ సువార్తను ప్రకటించాడు.


ఇది నమ్మడానికి కష్టంగా ఉన్నా, ఇది నిజంగా జరిగింది. తాను చంపడానికి ప్రయత్నించిన వ్యక్తి సహాయంతో డేవిడ్ క్రీస్తు ఇచ్చే నూతన జీవం పొందడానికి ప్రార్ధించాడు!


క్రిస్ రహస్యం ఏమిటంటే : డేవిడ్ లో ఉన్న చేదు అనే ఆ విషం తన నరాల్లోకి ఎక్కించుకోవడానికి నిరాకరించాడు. కీడువలన జయింపబడక, మేలు చేత కీడును జయించాడు. (రోమీయులకు 12:21)


Stabbed but Not Poisoned



ఇది నిజంగా జరిగిన ఒక అద్భుతమైన జీవితకథ. దేవుడు జోక్యం చేసుకోకపోతే, దీని అంతం చాలా విషాదంగా ఉండేది. 💜


No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.