పాపానికి మూలం : "నేను"

సిలువను ఎత్తికొని యేసుని వెంబడించడాన్ని మనం ఏ ఏ విధాలుగా తప్పించుకుంటామో ఈరోజు వాక్యధ్యానం వివరిస్తుంది. దానికి దైవ గ్రంధం నుండి పరిష్కారాలు కూడా చూద్దాం!


లూకా 9:23-24 లో యేసు సిలువను ఎత్తుకోమని చెప్పిన వెంటనే, తన ప్రాణమును రక్షించుకొనగోరువాడు దానిని పొగొట్టుకొనును, నా నిమిత్తమై తన ప్రాణమును పోగొట్టుకొనువాడు దానిని రక్షించుకొనును అని చెప్పడం చూస్తాం.


పడిపోయిన మానవ స్వభావాలకు ఎలాంటి భావనలు నచ్చుతాయంటే :

• స్వీయ ఆనందము.
• స్వీయ గౌరవం.
• దీనికి మనం యోగ్యులం అని నమ్ముట.
• నాకిష్టమైనట్టుగా అన్నీ చేసుకోవడం.


కాని దైవ గ్రంధం ఏమి ఆజ్ఞాపిస్తుందంటే (మత్తయి 16:24-27) (1):

• తన్ను తాను ఉపేక్షించుకోవాలి.
• తన్ను తాను త్యాగం చేసుకోవాలి.
• "దేవుడు" యోగ్యమైనవాడని నమ్మాలి.
• దేవునికి ఇష్టమైనట్లే అన్నీ చేయడం.


ఈ లోకంతో, మన స్వార్ధపూరిత స్వభావంతో మనమెంత బలంగా ప్రభావితం చేయబడ్డామో, గ్రహించం అనేది చాలా అరుదు. ఒకోసారి దేవునికి పేరు గౌరవం కంటే నా పేరు గౌరవానికే ప్రాధాన్యత ఇస్తుంటానని, నన్ను నేను ఉపేక్షించుకోవడం కంటే నా ఇష్టాలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంటానని నేను ఒప్పుకుంటున్నాను.


కాని అలాంటప్పుడే యేసు నా పాపాలకోసం కేవలం సిలువను మోయడం మాత్రమే కాదు, దానిపై నాకోసం మరణించాడు కూడా అని నేను జ్ఞాపకం చేసుకుంటాను.


నిజమైన శిష్యులుగా, నిజంగా సిలువను మోసేవారుగా ఉండటానికి సహాయం చేయమని దేవుణ్ణి వేడుకుందామా! మనం నిజంగా అలా ఉంటే ఈ ప్రపంచాన్ని ఎంతగా ప్రభావితం చేయగలమో కదా!!


--------


(1) మత్తయి 16:24-27
అప్పుడు యేసు తన శిష్యులను చూచి ఎవడైనను నన్ను వెంబడింపగోరినయెడల, తన్నుతాను ఉపేక్షించుకొని, తన సిలువనెత్తికొని నన్ను వెంబడింపవలెను. తన ప్రాణమును రక్షించుకొనగోరువాడు దాని పోగొట్టుకొనును; నా నిమిత్తము తన ప్రాణమును పోగొట్టుకొనువాడు దాని దక్కించుకొనును. ఒక మనుష్యుడు లోకమంతయు సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకొంటే అతనికేమి ప్రయోజనము? ఒక మనుష్యుడు తన ప్రాణమునకు ప్రతిగా నేమియియ్యగలడు? మనుష్యకుమారుడు తన తండ్రి మహిమ గలవాడై తన దూతలతో కూడ రాబోవుచున్నాడు. అప్పుడాయన ఎవని క్రియలచొప్పున వానికి ఫలమిచ్చును.


The Crux of Sin: SELF


సిలువను ఎత్తికొని యేసుని వెంబడించడాన్ని మనం ఏ ఏ విధాలుగా తప్పించుకుంటామో ఈరోజు వాక్యధ్యానం వివరిస్తుంది. దానికి దైవ గ్రంధం నుండి పరిష్కారాలు కూడా చూద్దాం!


No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.