ఎందుకని మంచిది కూడా అతిగా చేస్తే అది చెడ్డది

ఏదైనా మంచిది అతిగా చేసేదాన్నుండి తప్పించుకోవాలని దేవుని వాక్యం ఒక ఆసక్తికరమైన సాదృశ్యం ద్వారా హెచ్చరిస్తుంది. ఈరోజు వాక్యధ్యానం దీనినే వివరిస్తుంది!


పాత నిబంధన అంతటిలో తేనె మంచికే సాదృశ్యంగా కనబడుతుంది.


వాగ్దాన భూమి పాలు తేనెలు ప్రవహించే స్థలంగా పిలువబడింది. దయగల మాటలు, దేవుని వాక్యం, పెండ్లి కుమారుడు పెండ్లి కుమార్తె పెదవులను తేనెతో పోల్చడం అన్నీ ఉదాహరణలు (నిర్గమకాండము 3:8, సామెతలు 16:24, కీర్తనలు 19:9-10, పరమగీతములు 4:11).


కాని దేవుని వాక్యం ఏమని హెచ్చరిస్తుందంటే:


• తేనె కనుగొంటివా? తగినంతమట్టుకే త్రాగుము అధికముగా త్రాగినయెడల కక్కివేయుదువేమో (సామెతలు 25:16)



• తేనెనధికముగా త్రాగుట మంచిది కాదు. దుర్లభమైన సంగతి పరిశీలన చేయుట ఘనతకు కారణము. (సామెతలు 25:27)


ఆత్మసంబంధమైన విషయాలను అర్ధం చేసుకోవడానికి దేవుడు సాదృశ్యాలను ఉపయోగించే విధానం నాకెంతో ఇష్టం.


తేనె చాలా తీయనిది. అది చెక్కెరకంటే 25% ఎక్కువ తీయనిది. ఎలాగైతే ఏదైనా వంటకంలో తేనెను అతిగా వేస్తే అది చెడిపోతుందో, అలానే మనం కూడా ఎప్పుడైతే దేవుని కోరికలకంటే మన ఆనందాలు మన కోరికలపై అతిగా దృష్టి పెడతామో, అది మన శ్రేయస్సుకు కూడా నాశనాన్ని తీసుకొస్తుంది. ఉదాహరణకు :  అతిగా విహారయాత్రలకు వెళ్లడం, అతిగా టీవి చూడటం, అతిగా ధనంపై దృష్టి పెట్టడం, అతిగా విరామం తీసుకోవడం, అతిగా ఇతరుల మెప్పు కోరడం, మొదలైనవి..(1)


మనం ఆనందించడానికే దేవుడు మంచి విషయాలు మనకిచ్చారు, కాని వాటిపైనే మనం దృష్టి నిలిపితే అవే మనలను ఆత్మీయంగా బలహీనులుగా చేస్తాయి.


మన పిలుపే మనలను మనం తృణీకరించుకోవడం, మన సమయాన్ని, వనరులను, ప్రార్ధనను దేవునికి ఆయన రాజ్యం కోసం ధారాళంగా ఇవ్వడం (లూకా 9:23, మత్తయి 6:19-21). కాబట్టి ప్రియమైన క్రైస్తవులారా, ఈరోజు మన జీవితాలను ఒక అంచనా వేసుకుంటూ, ఈ విధంగా మనం ఉన్నామో లేదో దేవుణ్ణి అడుగుదామా?

----------------------


(1) *మనకి సరిపోతుంది అని ఎప్పుడూ సరిపెట్టుకోలేని ఒకేఒక్క మంచిది ఒకటి ఉంది : అదేమిటంటే ఎంతైనా దేవుణ్ణి మాత్రం అతిగా పొందలేం.


Why Too Much of a Good Thing is a Bad Thing



ఏదైనా మంచిది అతిగా చేసేదాన్నుండి తప్పించుకోవాలని దేవుని వాక్యం ఒక ఆసక్తికరమైన సాదృశ్యం ద్వారా హెచ్చరిస్తుంది. ఈరోజు వాక్యధ్యానం దీనినే వివరిస్తుంది!


No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.