ఈ భూమిపై పూర్తి శారీరిక స్వస్థతను ఎందుకు దేవుని వాక్యం వాగ్దానం చేయలేదు.


దేవుని వాక్యం ఎంతో స్పష్టంగా ఉన్నా గాని, స్వస్థత ఎందుకు అంత వివాదాస్పదమైన అంశంగా ఉందో నాకు అర్ధం కాదు. ఈరోజు వాక్యధ్యానంలో దీని వివరణ చూద్దాం!


క్రీస్తు నిజంగానే సిలువపై ప్రతీ విశ్వాసిని పూర్తిగా రక్షించాడు, లోకాన్ని, పాపాన్ని, మరణాన్ని, వ్యాధిని, సాతానును జయించాడు (యెషయా 53:5; కొలోస్సీయులకు 2:9-15).


యేసు యొక్క విజయాలన్నీ చట్టపరమైనవి, శాశ్వతమైనవి. కాని,  వీటి పూర్తి నెరవేర్పు ఈ భూమిపై ఉండగా మనం అనుభవించం.


నేను లోకమును జయించియున్నాను, కాని లోకంలో మీకు శ్రమ అని యేసు మాటల్లో ఆయనే మనకు స్పష్టతనిచ్చారు:


లోకములో మీకు శ్రమ కలుగును; అయినను ధైర్యము తెచ్చుకొనుడి, నేను లోకమును జయించియున్నాననెను. (యోహాను 16:33)


ఈ భూమిపై క్రైస్తవులను సాతాను కాని మరణం కాని ఎప్పటికీ భాధించవు అని ఎవ్వరూ భోదించరు, కాని, చాలా మంది అనారోగ్యం గురించి మాత్రం అలాంటి ప్రతిపాదన చేస్తారు.


అలాంటి అభిప్రాయం తప్పు. అవును దేవుడు స్వస్టపరచగలడు, స్వస్థపరిచాడు కూడా, కాని అది వాగ్దానం మాత్రం కాదు. (1)


హెబ్రీయులకు 2:5-9 లో దీనినే స్పష్టంగా వివరించడం జరిగింది. అది ఏమిటంటే, సమస్తమును దేవుడు తన ప్రజల పాదములక్రింద ఉంచారు, కాని... "ప్రస్తుతమందు మనము సమస్తమును వానికి లోపరచబడుట ఇంకను చూడలేదు".


ఒకవేళ ఈ భూమిపై దేవుడు స్వస్థతను వాగ్దానం చేసి ఉంటే ఎంతో నమ్మకస్తుడైన తిమోతి తరచూ అనారోగ్యంతో శ్రమపడేవాడు కాదు (1 తిమోతి 5:23).


కాని ఏ లోపము లేని నిత్యత్వం కొరకు మనం ఎదురు చూడొచ్చు,
"మనము దిగంబరులము కాక వస్త్రము ధరించుకొనినవారముగా కనబడుదుము. కాబట్టి పరలోకమునుండివచ్చు మన నివాసము దీనిపైని ధరించుకొననపేక్షించుచు దీనిలో మూల్గుచున్నాము. ఈ గుడారములోనున్న మనము భారము మోసికొని మూల్గుచున్నాము. ఇది తీసివేయవలెనని కాదు గాని మర్త్యమైనది జీవముచేత మింగివేయబడునట్లు, ఆ నివాసమును దీనిపైని ధరించుకొనగోరుచున్నాము. (2 కొరింథీయులకు 5:1-5)


చాలా అబద్ద బోధలు నిలకడలేని వాటిపై ఆధారపడినవి. బెరయ సంఘస్తుల వలె, మనం కూడా చాలా జాగ్రత్తగా, వివేకంగా ఉందాం (అపో. కార్యములు 17:11).


నోట్ :


(1) అనారోగ్యంతో ఉన్నవారి కోసం ప్రార్ధించాలి ఎందుకంటే వారిని స్వస్థపరచడం దేవుని ప్రణాళికలో ఒక భాగం కావొచ్చు (యాకోబు 5:14-16). కాని దేవుని సేవ చేస్తూ అనారోగ్యానికి గురైన నమ్మకమైన విశ్వాసులైన తిమోతి (1 తిమోతి 5:23), ఎపఫ్రొదితును  (ఫిలిప్పీయులకు 2:25-30), త్రోఫిము (2 తిమోతికి 4:20) గురించి మనం తెలుకోవాలి. చాలా మంది బైబిల్ పండితులు పౌలుకు ఉన్న "శరీరంలో ఒక ముల్లు" శారీరిక అనారోగ్య సమస్యే అని బలంగా నమ్ముతున్నారు (2 కొరింధీయులకు 12:1-10).


కొందరు యేసు ఈ భూమిపై ఉన్నప్పుడు చాలా మందిని స్వస్థపరిచారని, అందుకే అది వాగ్దానం అని అంటారు. కాని యేసు నీటిపై నడిచారు, చనిపోయినవారిని లేపారు, నీటిని ద్రాక్షారసంగా మార్చారు, కొద్దిపాటి రొట్టె చేపలతో వేలమందికి ఆహారం కూడా పెట్టారు. ఆయన కంటే ఎక్కువ మనం కూడా చేయగలం అని యేసు చెప్పినదానిలో (యోహాను 14:12) అర్ధం ఏమిటంటే, యేసు ఈ లోకంలో తానున్న సమయంలో ఎంత ప్రభావం చూపగాలిగారో, అంతకంటే ఎక్కువ ప్రభావం మనం చూపగలమని.


Why Scripture Doesn't Promise Complete Physical Healing on Earth



దేవుని వాక్యం ఎంతో స్పష్టంగా ఉన్నా గాని, స్వస్థత ఎందుకు అంత వివాదాస్పదమైన అంశంగా ఉందో నాకు అర్ధం కాదు. ఈరోజు వాక్యధ్యానంలో దీని వివరణ చూద్దాం!


No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.