ఆహా నీ ఆజ్ఞలు నాకెంతో ప్రియములు!


ఈరోజుల్లో మానవజాతి అంతా, క్రైస్తవులం అని చెప్పుకునే వారు సైతం దేవుని ఆజ్ఞలను నిరాకరిస్తూ ఉంటే, 119 వ కీర్తన దేవుని ఆజ్ఞలు గురించి ఇప్పటికీ సరిపోయే జ్ఞానాన్ని అందిస్తుంది.


ఈరోజు 119 వ కీర్తన చదివి చూడు. ఆ కీర్తన దేవునికి, ఆయన వాక్కుకి ప్రేమతో పాడే ఒక పాటవంటిది.


కీర్తనాకారుడు దేవుని వాక్యాన్ని దేవుని ఆజ్ఞలుగా ఇంకా వివిధ రకాలుగా వర్ణిస్తూ స్తుతించడం మనం చూస్తాం. ఒక సృష్టికర్తగా దేవునికి మాత్రమే ఏది తప్పో ఏదో ఒప్పో నిర్వచించే అధికారం ఉంది. ఏది మనకి దీవెనకరమో ఏది మనకి నాశనకరమో ఆయనకు మాత్రమే తెలుసు.


మారుతున్న ప్రస్తుత సమాజంలో సత్యం, జ్ఞానం యొక్క పునాదులు మూడు ప్రాముఖ్యమైన విధానాలలో పాడైపోతున్నాయి (కీర్తనలు 11:3):


1. మన ప్రస్తుత సమాజం కీడును మేలని, మేలును కీడని పిలుస్తుంది (యెషయా 5:20).


2. కొత్త నిబంధనలో ఉన్న ఆజ్ఞలకు విధేయత చూపడం ప్రాముఖ్యం అనేది కేవలం ఒక "ఆచారం" అని అబద్ద బోధకులు బోధిస్తున్నారు (రో్మీయులకు 6:1-2).


3. అబద్ద బోధకులు, క్రీస్తు చేసి ముగించిన పని యొక్క విలువను తగ్గించే విధంగా పాత నిబంధనలోని ఆజ్ఞలు ఖచ్చితంగా పాటించాలని తప్పు దోవ పట్టిస్తున్నారు (గలతీయులకు 2:19-21).


• సంఘానికి వెలుపల ఉండే గర్విష్టులు దేవుని వాక్యాన్ని నిరాకరిస్తూ ఉంటే (రో్మీయులకు 1:16-32), సంఘములో ఉండే గర్విష్టులు దేవుని వాక్యాన్ని  వక్రీకరిస్తున్నారు.


నీ ఆజ్ఞలనుబట్టి నేను హర్షించెదను అవి నాకు ప్రియములు.... గర్విష్ఠులు నన్ను మిగుల అపహసించిరి అయినను నీ ధర్మశాస్త్రము నుండి నేను తొలగకయున్నాను (కీర్తనలు 119:47-51) అని చెప్పిన కీర్తనాకారుడితో మనం కూడా ఏకీభవిద్దామా!!


How I Delight in Your Commands!


ఈరోజుల్లో మానవజాతి అంతా, క్రైస్తవులం అని చెప్పుకునే వారు సైతం దేవుని ఆజ్ఞలను నిరాకరిస్తూ ఉంటే, 119 వ కీర్తన దేవుని ఆజ్ఞలు గురించి ఇప్పటికీ సరిపోయే జ్ఞానాన్ని అందిస్తుంది.


No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.