ఒస్వాల్డ్ ఛాంబర్స్ (1874-1917), తన పుస్తకాల ద్వారా ప్రసిద్ధి చెందినా, ఆయన ఎన్నడూ వాటిలో ఒక్క అక్షరం కూడా వ్రాయలేదు.
27వ ఏట లోతైన విశ్వాసపు అనుభవం పొందాడు; దాని తరువాత నాలుగేళ్ళకి ఒక చోటు నుండి ఇంకో చోటుకి వెళ్లి బోధించాడానికి వీలుగా తన టీచర్ ఉద్యోగానికి రాజీనామా చేశాడు. గ్రేట్ బ్రిటన్ లో, అమెరికా లో, జపాన్ లో దేవుని సత్య వాక్యం ప్రకటించాడు.
ఈజిప్ట్ లో వరల్డ్ వార్ 1 సమయంలో బ్రిటిష్ ఆర్మీకి వాక్యాన్ని బోధించే భోదకునిగా ఉంటూ 43 వ ఏట మరణించాడు.
ఎప్పుడెప్పుడైతే ఆయన వాక్యాన్ని భోదించాడో, అప్పుడు ఆయన భార్య వాటిని క్షుణ్ణంగా నోట్స్ రాసుకోని ఉండకపోతే, ఒస్వాల్డ్ ఛాంబర్స్ బోధలన్నీ మనకి లభించేవి కాదు.
ఒస్వాల్డ్ ఛాంబర్స్ మరణం తరువాత బిడ్డీ ఛాంబర్స్ ఆయన చేసిన బోధలన్నిటినీ సరైన క్రమంలో పెట్టి, ముప్పై పుస్తకాలకంటే ఎక్కువ ముద్రించారు. వాటిలో "మై అట్మోస్ట్ ఫర్ హిస్ హైయెస్ట్" అనే పుస్తకం చాలా ప్రసిద్ధి చెందింది.
మనలో ప్రతీ ఒక్కరికీ దేవుని రాజ్యానికి సంబంధించి చేయడానికి ముఖ్యమైన పనులు ఉన్నాయి (ఎఫెస్సీయులకు 2:10), ఎవరు చూసినా చూడకపోయినా, ఎవరూ గుర్తించకపోయినా, మనం నమ్మకంగా వాటిని చేస్తే తప్పకుండా దానికి ప్రతిఫలం ఉంటుంది (కొలస్సీయులకు 3:23; హెబ్రీయులకు 6:10).
ఎక్కడో కొద్ది మంది బిడ్డీ ఛాంబర్స్ పేరు గుర్తుపడతారేమో కాని ఆమె ప్రేమతో చేసిన ఈ పని వల్ల ఆ సత్యవాక్యంతో కూడిన దైవ ధ్యానలను చదివిన లక్షల కోట్ల మంది ఎంతో దీవించబడ్డారు.
నీవు ఏమి చేయడానికి దేవుడు నిన్ను చేసుకున్నాడు? నమ్మకంగా దానిని చెయ్యి!
No comments:
Post a Comment
Note: Only a member of this blog may post a comment.