భూసంబంధమైన ప్రతిఫలమా లేక పరసంబంధమైన ప్రతిఫలమా?

మత్తయి 6వ అధ్యాయంలో ఉన్న భూసంబంధమైన, పరసంబంధమైన వ్యత్యాసాల సారాంశాన్ని ఈరోజు వాక్యధ్యానం వివరిస్తుంది!


శాశ్వతమైన, ఉన్నతమైన విలువ కలిగిన, పరసంబంధమైన ప్రతిఫలమా లేక తాత్కాలికమైన, క్షణికమైన లోకసంబంధమైన ప్రతిఫలమా ఏది కావాలో దానిని ఎంపికచేసుకోమని బైబిల్ మనకు చెబుతుంది.


ఇదే విషయం మత్తయి 6వ అధ్యాయంలో మూడుసార్లు నొక్కిచెప్పడం మనం చూస్తాం.


• ఇతరుల దృష్టికి మనం మంచివారంగా కనిపించాలని, అవసరంలో ఉన్నవారికి మనం సహాయం చెయ్యొచ్చు. అలా గనుక మనం చేస్తే, మనం పొందే ప్రతిఫలం ఈ భూమిపై మనుష్యులు ఏదైతే పొగడ్తలు ఇస్తారో అంతవరకే పరిమితం. దేవుని వద్దనుండి మనకు ఏ ప్రతిఫలం ఉండదు (6:2).


• ఇతరులకు ఆత్మీయతలో గొప్పవారంగా కనిపించాలని వారిని ఆకట్టుకోవడానికి మనం గొప్పగొప్ప పదాలతో దీర్ఘ ప్రార్ధనలు చెయ్యొచ్చు. అలా గనుక మనం చేస్తే, మనం పొందే ప్రతిఫలం ఈ భూమిపై మనుష్యులు ఏదైతే పొగడ్తలు ఇస్తారో అంతవరకే పరిమితం. దేవుని వద్దనుండి మనకు ఏ ప్రతిఫలం ఉండదు (6:5).


• ఆత్మీయ క్రమశిక్షణ కోసం మనం చేసే ఉపవాసాలు లేక ఇతరమైనవి ఇతరులు గమనించాలని, వారి ముందు మనం చాలా దైవికమైనవారంగా గుర్తింపు పొందాలని (వాస్తవంగా కాకపోయినా) ప్రయత్నించవచ్చు. అలా గనుక మనం చేస్తే, మనం పొందే ప్రతిఫలం ఈ భూమిపై మనుష్యులు ఏదైతే పొగడ్తలు ఇస్తారో అంతవరకే పరిమితం. దేవుని వద్దనుండి మనకు ఏ ప్రతిఫలం ఉండదు (6:16).


మనకు ఎక్కడ నుండి ఎవరి నుండి ప్రతిఫలం కావాలో (మనుష్యులు లేక దేవుడు) దాని వ్యవధి (తాత్కాలికం లేక శాశ్వతం) ఎంత కావాలో మన ఎంపిక మీదే ఆధారపడి ఉంది - మత్తయి 6:20. తెలివైన ఎంపిక చేసుకుందామా?


Earthly or Eternal rewards


మత్తయి 6వ అధ్యాయంలో ఉన్న భూసంబంధమైన, పరసంబంధమైన వ్యత్యాసాల సారాంశాన్ని ఈరోజు వాక్యధ్యానం వివరిస్తుంది!


No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.