ఎందుకు అసలు సాతానుకి అధికారం ఉంది?

దేవుడు అసలు ఎందుకు సాతానుకి ఉనికిని అనుమతించాడు? ఈరోజు వాక్యధ్యానంలో దేవుని పరిశుద్ధ గ్రంధం నుండి దీని గురించి కొన్ని ముఖ్యాంశాలు తెలుసుకుందాం!


సాతానుకి అసలు అధికారం ఎందుకుంది?


ఒకవేళ యేసు మరణం ఈ భూమిపై అన్నిటినీ ఆయన అధికారం క్రిందకి తెచ్చేదైతే, ఎందుకు ఇంకా సాతానుకి ఈ ప్రపంచాన్ని ఉక్కిరిబిక్కిరి చేసి నాశనం చేయడానికి స్వాతంత్రం ఉంది? ఈ విషయాలను గురించి వాక్యం ద్వారా మనం ఏమి నేర్చుకోవచ్చు?


1. యేసు మరణాన్ని, పాపాన్ని జయించడం యొక్క పూర్తి నెరవేర్పును, దానిలోని విజయాన్ని ఆయన రెండవ రాకడ వరకు మనం చూడలేం (హెబ్రీయులకు 2:5-9; యోహాను 16:33).


2. దేవుడిచ్చిన ఒక పరిపూర్ణమైన మంచి ప్రపంచంలోనికి మానవుడు పాపాన్ని తెచ్చినప్పుడు, దేవుడు దానిలో నుండి బయటపడే రక్షణ ప్రణాళికను అందించాడు. బహుశా మానవాళి రక్షణకు సాతాను పని యొక్క అవసరత ఉంది, లేదంటే దేవుడు దానిని అనుమతించడు. (ఆదికాండము 3).(1)


3. తన పిల్లలను పరీక్షించి, వారి బలాన్ని పెంచడానికి దేవుడు సాతాన్ని ఉపయోగించుకుంటాడు (యోబు ; రో్మీయులకు 8:28). (2)


4. దేవుడు చెడుని ఉపయోగించుకుంటాడు కాని చెడుకి కారకుడు మాత్రం కాదు (ఆదికాండము 50:20; యాకోబు 1:13; 1 యోహాను 1:5).


5. ఒకరోజు సాతాను శక్తి హింసాత్మకంగా, శాశ్వతంగా అంతమవుతుంది (ప్రకటన గ్రంధం 20:10).


6. దీనంతటిలో రహస్యం దాగి ఉంది, కాని మన దేవునిపై మనం పూర్తి నమ్మకం పెట్టుకోవచ్చు (1 కొరింధీయులకు 13:12).


---------------


(1) అప్పటివరకు పరీక్షంపబడని ఆదాము, అవ్వలను పరీక్షించడానికి ఒక పడిపోయిన దేవదూతగా ఉన్న సాతానుని, దేవుడు వాడుకున్నాడు. వారు పరీక్షకు గురైనపుడు, రక్షకుని అవసరత ఉన్న పాపులుగా నిరూపించబడ్డారు. అప్పుడే దేవుని రక్షణ ప్రణాళిక ఆరంభమైంది. మనలో ఏ ఒక్కరం ఈ పరీక్ష మరియు రక్షణ పద్ధతులను పూర్తిగా అర్ధం చేసుకోలేము, కాని దేవుని వివేకాన్ని, జ్ఞానాన్ని మాత్రం మనం పూర్తిగా నమ్మగలం.


(2) దేవుని గ్రంధంలో సాతానుకి మరియు దేవునికి సంబంధించిన ఈ అంశాన్ని అంటే దేవుడు తన ప్రణాళికల కొరకు సాతానుని ఉపయోగించుకుంటాడు అనే దాన్ని నిరూపించే ఒక సన్నివేశం ఇక్కడ కనబడుతుంది.


Understanding Why Satan Has power


దేవుడు అసలు ఎందుకు సాతానుకి ఉనికిని అనుమతించాడు? ఈరోజు వాక్యధ్యానంలో దేవుని పరిశుద్ధ గ్రంధం నుండి దీని గురించి కొన్ని ముఖ్యాంశాలు తెలుసుకుందాం!


No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.