యదార్థమైన కృతజ్ఞత - 1 తిమోతి 6:7-8

యదార్థమైన కృతజ్ఞత నిరీక్షణకు ఆధారం లేని స్థలాలలోనే దొరుకుతుంది. ఈరోజు వాక్యధ్యానం ఆత్మీయ మేలుకొలుపును పంచుతూ దీనినే వివరిస్తుంది.


మనలో చాలా మందిమి ఇంటికి, కారుకి యజమానిగా ఉండటం మన 'హక్కు' అనుకుంటాం. వేడినీళ్ల స్నానం, సౌకర్యవంతమైన మంచి వంటగది మన 'అవసరాలుగా' భావిస్తాం.


మన చూపు, వినికిడి, ఆరోగ్యాన్ని కూడా ఆశీర్వాదాలుగా చూడం.


• విచారం ఏమిటంటే, ఎక్కువ ఉండేకొద్దీ, ఇంకా ఎక్కువ కావాలని ఆశపడతాం.


కొన్ని సంవత్సరాల క్రితం అమెరికాలో రెండు కుటుంబాల ఆర్ధిక పరిస్థితుల గురించి ఒక షో నేను చూసాను. అందులో ఒకామె చాలా తక్కువ జీతానికి పనిచేస్తూ, వికలాంగుడైన తన భర్తతో ఒక చిన్న ఇంట్లో ఉండేది. కాని చిన్న చిన్న వాటికి కూడా ఆమె ఎంతో కృతజ్ఞతతో ఉండేది. ఇంకొకామె ఉన్నత స్థితిలో జీవిస్తుంది. విలాసం కోసం విల్లా కావాలనుకుంది కాని దానిని పొందలేకపోయిందని చాలా తీవ్రంగా ఫిర్యాదు చేస్తూనే ఉంది.


కొన్నిసార్లు ఒక్క అడుగు వెనక్కి వేసి, మనకున్న ఆశీర్వాదాలను లెక్కపెట్టుకోవాలి.


~ మనమీలోకములోనికి ఏమియు తేలేదు, దీనిలోనుండి ఏమియు తీసికొని పోలేము. కాగా అన్నవస్త్రములుగలవారమై యుండి వాటితో తృప్తిపొందియుందము. (1 తిమోతికి 6:7,8)


కృతజ్ఞత కలిగి ఉండటం అనేది క్రైస్తవ విశ్వాసానికి చాలా ప్రాముఖ్యమైన అంశం :


~ ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఈలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయములో దేవుని చిత్తము. (1 థెస్సలొనీకయులకు 5:18)


చాలా కఠినమైన పరిస్థితులలో కూడా క్రైస్తవులు కృతజ్ఞతతో ఉండటానికి అవకాశం ఉంది ఎందుకంటే మనం మన ప్రియమైన ప్రభువు చేత రక్షింపబడ్డాం గనుక. అసలు మన దేవుడు మనకోసం ఏమి చేసాడో నిజంగా గ్రహిస్తే అదే ఎల్లప్పుడూ మనం కృతజ్ఞత కలిగి ఉండటానికి ఒక అద్భుతమైన కారణంగా ఉంటుంది.


~ చెప్ప శక్యము కాని ఆయన వరమును గూర్చి దేవునికి స్తోత్రము. (2 కొరింథీయులకు 9:15)


• ఈ సత్యమును ఈరోజు, ప్రతీ రోజూ మనం హత్తుకొందుము గాక!


Genuine Thankfulness - 1 Timothy 6:7-8


యదార్థమైన కృతజ్ఞత నిరీక్షణకు ఆధారం లేని స్థలాలలోనే దొరుకుతుంది. ఈరోజు వాక్యధ్యానం ఆత్మీయ మేలుకొలుపును పంచుతూ దీనినే వివరిస్తుంది.


No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.