ఆఫ్రికాలో ప్రతికూలతలకు ఎదురునిలిచిన మేరీ స్లెస్సర్

స్కోట్లాండ్కు చెందిన తెల్లని చెర్మం, ఎర్రని వెంట్రుకలు కలిగిన చిన్న మనిషి అయిన ఈమె 1800లో ఆఫ్రికాలో తట్టుకోని బ్రతికడం సాధారణమైన విషయం కాదు. ఈమె జీవితం నిన్ను ఆశ్చర్యపరుస్తుంది!


ఒక్క ఉద్యోగాన్ని కూడా నిలబెట్టుకోలేని త్రాగుబోతైన తండ్రి.


మురికివాడలో జీవితం.


ఆమె అన్నలు చిన్నతనంలోనే మరణించారు.


ఆహారం కోసం తన తల్లితో కలిసి పదకొండేళ్ల మేరీ స్లెస్సర్ అక్కడ ఉన్న మిల్లులో పనిచేయవలసి వచ్చింది. మేరీకి అత్యంత సంతోషకరమైన క్షణాలు దేవుని మందిరంలో గడపడమే, ఒక మిషనరీ అవ్వాలన్నదే ఆమె కల.


మేరీ చెల్లెలు తమ ఖర్చులను కట్టగలిగే అంత ఆదాయం సంపాదిస్తున్న సమయంలో, మేరీ తల్లి మిషన్ బోర్డుకు ధరకాస్తు చేసుకోమని మేరీని ప్రోత్సాహించింది.


అప్పుడు 1876 లో, తనంతట తానే మిల్లులో పనిచేస్తూ స్వయంగా కష్టపడి చదివిన 28 సంవత్సరాల మేరీ, ఆఫ్రికాకు ప్రయాణమైంది. అప్పట్లో ఆఫ్రికాకు "తెల్లవాళ్ల సమాధి" అనే పేరు ఉండేది, ఎందుకంటే ఆ దేశంలో నివసించడం అంటే చాలా కష్టం. స్కోట్లాండ్కు చెందిన తెల్లని చెర్మం, ఎర్రని వెంట్రుకలు కలిగిన చిన్న మనిషి అయిన ఈమె అక్కడ తట్టుకోని బ్రతకడం అంటే సాధారణమైన విషయం కాదు.


కాని మేరీ మునుపటి జీవితం ఆమెను అనారోగ్యాలకు, ప్రమాదాలకు, ఆఫ్రికాలో ఎదురయ్యే కఠినమైన సేవా పరిస్థితులకు సిద్దపరిచింది. వేరే ఏ ఇతర మిషనరీలు ఉండటానికి కూడా కష్టమనిపించిన ఆ స్థలంలో మేరీ 39 సంవత్సరాలు జీవించడం మాత్రమే కాదు ఆఫ్రికాలో ఉన్న అనేక వేల మందికి ఎంతో ప్రభావవంతముగా క్రీస్తును ప్రకటించింది.


కొన్నిసార్లు చిన్నతనంలో మనం ఎదురుకున్న కఠినమైన పరిస్థితులు మన జీవితాన్ని నాశనం చేస్తుందేమో అని మనం అనుకుంటాము, కాని మనకు జరిగిన కీడును మేలుకై ఉపయోగించే పనిలో మన దేవుడు ఉంటాడు (రో్మీయులకు 8:28).


• నీ జీవితంలో జరిగిన కఠినమైన పరిస్థితులను కూడా దేవుడు మేలుకై ఉపయోగించగలడు. అలా ఉపయోగించడానికి ఆయనకు అనుమతినిస్తావా?


Against the Odds: Mary Slessor in Africa


స్కోట్లాండ్కు చెందిన తెల్లని చెర్మం, ఎర్రని వెంట్రుకలు కలిగిన చిన్న మనిషి అయిన ఈమె 1800లో ఆఫ్రికాలో తట్టుకోని బ్రతికడం సాధారణమైన విషయం కాదు. ఈమె జీవితం నిన్ను ఆశ్చర్యపరుస్తుంది!


No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.