సమస్యల గురించి అతిగా ఆలోచించడాన్ని అయిదు విధాలుగా నివారించవచ్చు


నీవు అన్నింటినీ విశ్లేషించే వ్యక్తివైతే, అతిగా ఆలోచించే ఆ సమస్యను ఎలా నివారించాలో ఈరోజు వాక్యధ్యానంలో  నేర్చుందాం!


కష్టాలను ఒకొక్కరు ఒకొక్క విధంగా ఎదుర్కొంటారు.


కొందరు అతిగా విశ్లేషిస్తు దీర్ఘాంగా ఆలోచిస్తారు. మరికొందరు పరిస్థితిని మాములుగా పరిశీలించి, త్వరగా ముందుకు వెళ్ళిపోతారు.


స్వీయ పరీక్ష చేసుకొని ఆలోచించే వారు వారి పరిస్థితులలో స్పష్టతను, తార్కికమైన అవగాహనను పొందితే, తేలికగా తీసుకునే వారు పెద్దగా పట్టించుకోరు.


ఏది ఏమైనా, రెండు అతివృష్టిలలో ఎదో ఒకటైతే అందరం చేస్తాం. అతిగా ఆలోచించడం లేదా అస్సలు పట్టించుకోకుండా ఉండటం.


బాధ లేక కోపం కలిగించే ప్రతికూలమైన ఆలోచనలతో పోరాడుతూ అతిగా ఆలోచించే వారు, ఈ క్రింది విధానాలలో దానిని నివారించవచ్చు :


1. సమస్యల మధ్యలో శాంతిని దయచేయమని దేవుణ్ణి అడుగు (యోహాను 14:27).


2. ప్రత్యేకంగా నీ సమస్యకు సంబంధించిన సత్యాన్ని దేవుని గ్రంధంలో నుండి గుర్తించు (2 తిమోతి 3:16-17).


3. గుర్తించిన ఆ వచనాలను కంఠట పెట్టుకో లేక ఎక్కడైనా రాసుకో (కీర్తనలు 119:9-16).


4. ఎప్పుడెప్పుడైతే మళ్ళీ అతిగా ఆలోచించడం మొదలైనట్టు అనిపిస్తుందో, వెంటనే ఆ వచనాలను చదివి, తిరిగి నీకు చెప్పుకోవడం మొదలుపెట్టు (కీర్తనలు 119:9-16).


5. జీవితానికి కావాల్సిన మంచి దృక్పధం కోసం ప్రతీ రోజూ దేవుణ్ణి కలుసుకోవడం మరచిపోవద్దు (కీర్తనలు 130:5).


ఎప్పుడైతే అతిగా వచ్చే ఆలోచనలను దేవుని ఆలోచనలతో భర్తీ చేయడం మొదలుపెడతామో, ప్రతీ సమస్యకు దేవుడే మన ఆశ్రయం అని మనకు మనమే గుర్తుచేస్తున్నాం అన్నమాట. ఎందుకంటే ఆయనే మన ఆదరణ, జ్ఞానం, శాంతి గనుక. ఇలాంటి అలవాటుని అలవర్చుకుందామా!


5 Ways to Avoid Over-Thinking Your Problems


నీవు అన్నింటినీ విశ్లేషించే వ్యక్తివైతే, అతిగా ఆలోచించే ఆ సమస్యను ఎలా నివారించాలో ఈరోజు వాక్యధ్యానంలో  నేర్చుందాం!


No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.