ఎందుకని కొన్ని పాపాలు 'రెండుసార్లు' చేసినట్టు?

కొన్నిసార్లు పాపాలు మనకి రెండింతల శ్రమలుగా ఉంటాయి. ఈ ఆత్మీయ సత్యాన్ని యిర్మీయా 2:13 నుండి ఈరోజు వాక్యధ్యానంలో నేర్చుకుందాం!


మనం ఆత్మీయ సత్యాలను బాగా అర్ధంచేసుకోవాలనే ఆశతో దేవుడు కొన్ని అద్భుతమైన చిత్రాలను తన వాక్యంలో మనకు అందించారు.


ఉదాహరణకు :
నా జనులు రెండు నేరములు చేసియున్నారు, జీవజలముల ఊటనైన నన్ను విడిచియున్నారు, తమ కొరకు తొట్లను, అనగా బద్దలై నీళ్లు నిలువని తొట్లను తొలిపించుకొనియున్నారు. (యిర్మీయా 2:13)


• అవిశ్వాసులు తమ సమయాన్ని వ్యర్థమైన ఆశయాలతో వృధా చేసుకుంటున్నారు. అది దుష్టత్వం.


• ఇదే విషయాన్ని దేవుని బిడ్డలమైన మనం చేస్తే, ఆ దుష్టత్వాన్ని మనం రెండుసార్లు చేసినట్టు.


ఎలా అంటే - వ్యర్థమైన ఆశయాలపై మన సమయాన్ని వృధా చేసుకొనుట మరియు దేవుని ఆశయాలను తృణీకరించుటను బట్టి:


మరియు వాటియందు మనము నడుచుకొనవలెనని దేవుడు ముందుగా సిద్ధపరచిన సత్‌క్రియలు చేయుటకై, మనము క్రీస్తుయేసునందు సృష్ఠింపబడినవారమై ఆయన చేసిన పనియైయున్నాము. (ఎఫెస్సీయులకు 2:10)


జీవజలముల నుండి ఊరే తాజా పవిత్రమైన జలాలను ఆనందించే బదులు, బద్దలై నీళ్లు నిలువని తొట్లను కట్టుకుంటున్నాము.


జీవజలముల నుండి ఊరే తాజా పవిత్రమైన జలాలను సమకూర్చుకోవడం మరియు తొట్లను కట్టుకోవడం, రెండూ కష్టంతో కూడినవే. కాని తొట్లకు వెచ్చించే శ్రమ కంటే వచ్చే లాభం చాలా తక్కువ.


✝️ ఏ ఏ విషయాల్లో వ్యర్థమైన వాటి కోసం జీవితాన్ని వృధాచేసుకొంటూ, దేవుని ఉద్దేశాలను కోల్పోతున్నామో చూపించమని ఈరోజు దేవుణ్ణి అడుగుదామా!


Why Some Sins Are "Double Sins"



కొన్నిసార్లు పాపాలు మనకి రెండింతల శ్రమలుగా ఉంటాయి. ఈ ఆత్మీయ సత్యాన్ని యిర్మీయా 2:13 నుండి ఈరోజు వాక్యధ్యానంలో నేర్చుకుందాం!


No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.