నాయకుడిని వెంబడించుట

మనం యేసుని వెంబడిస్తున్నామని చెప్పొచ్చు, కాని అది నిజమేనా? మనం ఎవరిని వెంబడిస్తున్నామో పరీక్షించుకోవడానికి ఈరోజు వాక్యధ్యానం మనలను ప్రోత్సాహిస్తుంది!


వాక్యాన్ని బోధించేవారు, దాన్ని ఎంత బాగా జీవిస్తున్నారో అనే దానిని బట్టే ఆత్మీయ నాయకులను అంచనా వేయాలి.


నాయకులకే ఎక్కువ గుర్తింపు వస్తుంది, కాని అది నమ్మకంగా వెంబడించేవారిని బట్టే.


మనం పరలోకానికి వెళ్ళినప్పుడు, దేవుని రాజ్య పనిలో "తెరవెనుక" ఉండి ఉపయోగపడుతూ వెంబడించే వారికి ఎక్కువ ప్రతిఫలం దక్కడం మనం చూడొచ్చు.


కాని మనుషులను వెంబడించేవారు కొన్నిసార్లు సులభంగా చిక్కుల్లో పడే అవకాశం ఉంటుంది.


అహరోను తన దైవిక సహోదరుడైన మోషేను వెంబడించినంత కాలం మంచిగానే ఉన్నాడు (నిర్గమకాండము 4:12-16). కాని విగ్రహారాధన మనస్సు ఉన్న ఆ గుంపును వెంబడించడం ద్వారా బంగారు దూడ చేయాల్సిన సందర్భంలో పడిపోయాడు. తరువాత మిరియాము మోషే మీద అసూయతో తిరుగుబాటు చేసే సందర్భంలో ఆమెతో కలిసి మరలా పడిపోయాడు (సంఖ్యాకాండము 12)*


"దుష్టసాంగత్యం మంచి నడవడిని చేరుపుతుందని" దేవుని వాక్యం చెబుతుంది (1 కొరింధీయులకు 15:33). అందుకే మనం ఎవరిని వెంబడించాలి అనుకుంటున్నామో వారి నడవడిని ముందే అంచనా వేసుకోవాలి. దైవికమైన నాయకులను ఒకవేళ వెంబడించినా, వారు చేసే నిర్ణయాలు వాక్యానుసారంగా ఉన్నాయా లేదా అని పరీక్షించాలి.


మన ప్రభువు చిత్తాన్ని మనం తెలుకోవాలంటే బైబిలే మనకు ప్రధానమైన మార్గదర్శి (ఎఫెస్సీయులకు 5:8-17).


---------------------


*దేవుని వాక్యంలో ఎక్కడా మిరియాము ఒక నాయకురాలు అని చెప్పలేదు. దేవుడు ఆమెను అహరోనును గద్దించారు కాని మిరియామును శిక్షించారు కూడా. ఈ సంఘటన మరియు అహరోను ఆమె చెడు సలహాను పాటించడం అనే సంఘటన వలన ఈ సందర్భంలో మిరియామును అహరోను వెంబడించించాడని నేను నమ్ముతున్నాను.


Follow The Leader


మనం యేసుని వెంబడిస్తున్నామని చెప్పొచ్చు, కాని అది నిజమేనా? మనం ఎవరిని వెంబడిస్తున్నామో పరీక్షించుకోవడానికి ఈరోజు వాక్యధ్యానం మనలను ప్రోత్సాహిస్తుంది!


No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.