తొమ్మిది విధానాలలో కృతజ్ఞత కలిగి ఉండటం నేర్చుకో

ఎక్కువ కృతజ్ఞత కలిగి ఉండటం నేర్చుకోవచ్చు అని నీకు తెలుసా? అది అన్ని రీతులుగా నీకు క్షేమాభివృద్ధిని కలిగిస్తుంది.


కొందరు సహజంగానే కృతజ్ఞత కలిగి ఉంటారు. కాని మనలో చాలా మందిమి "కృతజ్ఞత వైఖరి" నేర్చుకోవాల్సిన అవసరం ఉంది.


ఈ క్రింది సూచనలు గమనించండి :


1. మీ ఆశీర్వాదాలు లెక్కించి వ్రాసుకోవడానికి ఒక "కృతజ్ఞతల పుస్తకాన్ని" పెట్టుకో.


2. భోజనం చేసే సమయంలో ఆరోజులో పొందిన మేళ్ళను కుటుంబ సభ్యులు ఒకరితో ఒకరు పంచుకోవాలి (ఫిలిప్పీయులకు 4:8).


3. ప్రార్ధనలో కేవలం అవసరాలు చెప్పుకోవడమే కాక, ఎక్కువ కృతజ్ఞతలు చెప్పడం నేర్చుకోవాలి.


4. మీ ఇంటిలో ఉన్న అద్దం లేక ఫ్రిడ్జ్ లేక ఏదైనా తలుపు మీద మీకు కనపడేలాగా కృతజ్ఞతకు సంబంధించిన దేవుని వాక్యాన్ని అంటించండి. ఉదాహరణ : కీర్తనలు 34:1, ఎఫెస్సీయులకు 5:19,20, 1 థెస్సలొనీకయులకు 5:18.


5. ఆ వాక్యాలను కంఠత పెట్టి, వాటిని మీ పిల్లలకు నేర్పించండి.


6. ఈ లోకంలో ఎంతో మందికి లేని, మీకు సులువుగా అందుబాటులో ఉన్న, పెద్దగా కృతజ్ఞత కలిగి ఉండని వాటి గురించి ఆలోచించండి. ఉదాహరణ : వేడి నీళ్ళు, భద్రత, నమ్మదగిన రవాణా, మంచి చెప్పులు, సౌకర్యావంతమైన మంచి వంటగది మొదలైనవి.



7. మంచి విషయాలు జరిగినప్పుడు వాటిని బట్టి ఆనందించండి, గుర్తుపెట్టుకోండి.



8. మీ ఆశీర్వాదాలు లెక్కించేటప్పుడు, అవి ఏమిటో స్పష్టంగా, వివరంగా వ్రాసుకోండి. స్పష్టత లేని సాధారణమైన పెద్ద చిట్టా వ్రాసుకోవడం కంటే ఇలా వ్రాసుకోవడం ఎక్కువ ప్రయోజనకరం.



9. ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఈలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయములో దేవుని చిత్తము. (1 థెస్సలొనీకయులకు 5:18). ఇది నిజంగా దేవుని చిత్తమని గుర్తుపెట్టుకోండి.


9 Ways to Learn Gratitude



ఎక్కువ కృతజ్ఞత కలిగి ఉండటం నేర్చుకోవచ్చు అని నీకు తెలుసా? అది అన్ని రీతులుగా నీకు క్షేమాభివృద్ధిని కలిగిస్తుంది.



No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.