వాక్యానుసారమైన ప్రేమ యొక్క 18 లక్షణాలు


ప్రేమ యొక్క 18 లక్షణాలు రో్మీయులకు 12లో మనకు కనబడతాయి. వీటిని తెలుసుకోవడం మనకు ఆశీర్వాదకరమని నేను నమ్ముతున్నాను!


కొరింధీయులకు వ్రాసిన మొదటి పత్రిక పదమూడవ అధ్యాయం ఒక ప్రేమ అధ్యాయం అనే విషయం అందరికీ తెలిసిన విషయమే, కాని రో్మీయులకు 12:9-12 కూడా ప్రేమ యొక్క లక్షణాలను మనకు వివరిస్తుంది.


1. ప్రేమ నిష్కపటమైనది.
2. ప్రేమ చెడును అసహ్యించుకుంటుంది.
3. ప్రేమ మంచిని హత్తుకొంటుంది.
4. ప్రేమ సహోదర ప్రేమకు కట్టుబడి ఉంటుంది.
5. ప్రేమ తనను తాను కాక ఇతరులను ఘనపరుస్తుంది.
6. ప్రేమ దేవుని కొరకైన ఆసక్తితో ఆత్మయందు తీవ్రతతో ఉంటుంది.
7. ప్రేమ దేవుని సేవిస్తుంది.
8. ప్రేమ నిరీక్షిస్తుంది సంతోషిస్తుంది.
9. ప్రేమ శ్రమయందు ఓర్పు కలిగి ఉంటుంది.
10. ప్రేమ ప్రార్ధనయందు పట్టుదల కలిగి ఉంటుంది.
11. ప్రేమ పరిశుద్ధుల అవసరములలో పాలుపొందుతుంది.
12. ప్రేమ శ్రద్దగా ఆతిధ్యాన్నిస్తుంది.
13. ప్రేమ హింసించేవారిని దీవిస్తుంది. కీడుకు ప్రతికీడు చేయదు గాని దేవుని ఉగ్రతకు చోటిస్తుంది.
14. ప్రేమ సంతోషించేవారితో సంతోషిస్తుంది.
15. ప్రేమ ఏడ్చువారితో ఏడుస్తుంది.
16. ప్రేమ ఇతరులతో మనస్సు కలిగి ఉంటుంది.
17. ప్రేమ గర్వించదు లేక అహంకారంతో ఉండదు.
18. ప్రేమ ఇతరుల ధనం లేక స్థితిగతులతో ప్రభావితం కాదు.

వీటన్నింటిలో ప్రేమ "కీడువలన జయింపబడక, మేలు చేత కీడును జయిస్తుంది". (రోమీయులకు 12:21)

• ప్రేమ యొక్క లక్షణాలన్నీ ఒక్కసారి ఇలా ధ్యానించడం మనకు చాలా ప్రయోజనకరం. ఈ గుణాలలో ఎందులో మనం మెరుగుకావాలో పరిశీలించుకొని దేవుని సహాయాన్ని వేడుకుందామా!


18 Characteristics of Biblical Love


ప్రేమ యొక్క 18 లక్షణాలు రో్మీయులకు 12లో మనకు కనబడతాయి. వీటిని తెలుసుకోవడం మనకు ఆశీర్వాదకరమని నేను నమ్ముతున్నాను!


No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.