నువ్వు దీనిని నమ్ముతున్నావా?

రో్మీయులకు 8:28 మనం తరుచూ ఉపయోగిస్తాం, కాని నిజంగా దీనిని నమ్ముతున్నామా? ఈరోజు వాక్యధ్యానం దీనిని నమ్మడానికి మనలను ప్రోత్సాహిస్తుంది!


నీకు వ్యతిరేకంగా మాట్లాడిన ఆ భయంకరమైన మాటలు, ఆ అన్యాయపు తీర్పు వలన నీవు పొందిన మనో వేదన గురించి ఒక్కసారి ఆలోచించు. నువ్వు మంచి చేసినవాళ్లు తిరిగి నీకు కీడు చేయడం, నువ్వు ఎంతో సహాయం చేసిన వాళ్ళు, నీ అవసరంలో సహాయం చేయకపోవడంలాంటి సందర్భాలు ఒక్కసారి ఆలోచించు. నువ్వు కష్టపడి పని చేస్తే వారు గుర్తింపు పొందడం మాత్రమే కాక నీకు చెడ్డ పేరు తేవడం, నీవు చాలా అవసరంలో ఉన్నప్పుడు వారు పూర్తిగా నిన్ను నిరాకరించడం ఒక్కసారి గుర్తుచేసుకో.


ఇవన్నీ నీ మేలుకై దేవుడు ఉపయోగించగలరని నువ్వు నమ్ముతున్నావా?


నువ్వు విశ్వాసివే అయి, నీ జీవితంలో దేవుని చిత్తాన్ని వెతికే వ్యక్తివే అయితే, నీ జీవితంలో జరిగే ప్రతీదీ నీ మేలుకే సమకూడి జరిగిస్తానని దేవుడు వాగ్దానం చేసాడు.


రో్మీయులకు 8:28 మనం తరుచూ జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాము. కాని నిజంగా నమ్ముతున్నామా?


దేవుని ప్రేమించువారికి, అనగా ఆయన సంకల్పముచొప్పున పిలువబడినవారికి, మేలుకలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని యెరుగుదుము. (రోమీయులకు 8:28)


దేవుడు ఎవ్వరినీ మనకు వ్యతిరేకంగా పాపం చేసేలా చేయడు (యాకోబు 1:13), కాని ఆయన అలాంటి పరిస్థితులను ఉపయోగించుకోని మనకు బోధించడం, శిక్షణనివ్వడం, బలపరచడం మరియు ఆయన ఉద్దేశాల కొరకు మనలను సిద్దపరచడం చేస్తారు (హెబ్రీయులకు 12:11) (1)


దీనిని నమ్ము విశ్వాసి!

------------------

(1) రోమీయులకు 8:28 సందర్భాన్ని బట్టి ఈ సత్యం ధ్రువీకరించబడింది. రోమీయులకు 8:29 వచనం లో ఇలా వ్రాయబడింది "ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడగునట్లు, దేవుడెవరిని ముందు ఎరిగెనో, వారు తన కుమారునితో సారూప్యము గలవారవుటకు వారిని ముందుగా నిర్ణయించెను". దేవుడు వివిధమైన వాటిని ఆయన కుమారుని స్వారూప్యంలోనికి మార్చడానికి, విశ్వాసాన్ని బలపరచడానికి ఉపయోగించుకుంటాడు.


Do You Believe It?



రో్మీయులకు 8:28 మనం తరుచూ ఉపయోగిస్తాం, కాని నిజంగా దీనిని నమ్ముతున్నామా? ఈరోజు వాక్యధ్యానం దీనిని నమ్మడానికి మనలను ప్రోత్సాహిస్తుంది!



No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.