మసకా లేక 20/20?

జోనతాన్ గోఫోర్త్ నిజంగానే చైనాకి మిషనరీగా వెళ్ళినప్పుడు 1800 చివర్లో తన చూపును పోగొట్టుకున్నాడా? ఈరోజు వాక్యధ్యానంలో తెలుసుకుందాం!


నా 12 ఏళ్ల వయస్సు నుండి నేను కళ్ళద్దాలు పెట్టుకుంటున్నాను. అవి లేకపోతే నా ప్రపంచం మసకగా ఉంటుంది.


కాని ఇంకోరకమైన చూపు ఉంది. ఈ సత్యాన్ని జోనతాన్ గోఫోర్త్ తన జీవితం ద్వారా వర్ణించాడు.


45 ఏళ్ళు చైనాలో మిషన్ పని చేసాక, 1800 చివర్లో 1900 మొదట్లో జోనతాన్ గోఫోర్త్ చూపును పోగొట్టుకున్నాడు.


చైనాలో జీవితం సులువైనదేమీ కాదు చాలా కఠినమైనది. ఒకవేళ ఈ 74 ఏళ్ళ జోనతాన్ గోఫోర్త్ తన పని నుండి విరమించుకొని తన సొంత దేశమైన కెనడాకి వెళ్ళి క్షేమంగా, సౌకర్యవంతంగా ఉండాలనుకున్నా, ఎవ్వరూ ఆయనను తప్పుపట్టరు. కాని చూపులేకపోవడం వల్ల తను ఆగిపోకూడదని గోఫోర్త్ నిర్దారించుకున్నాడు.


అప్పటికే ఆయన క్రొత్త నిబంధన అంతా ఆంగ్లంలో మరియు మండరిన్ లో కంఠత పెట్టి ఉండడం వల్ల, వాక్యానుశారమైన కౌన్సిలింగ్ ఇవ్వడం ప్రారంభించాడు.


ఒకరకంగా గోఫోర్త్ చూపులేనివాడు కావొచ్చు, కాని ఆత్మీయంగా అద్భుతమైన చూపును కలిగినవాడు.


దేవుని వాక్యం గురించిన సరైన జ్ఞానం మనకు లేకపోతే, మన జీవితాలు నిజంగానే మసకగా ఉంటాయి. దేవుని వాక్యాన్ని మన హృదయాల్లో ఎప్పుడైతే "దాచుకుంటామో" ఆ వాక్యమే మనలో దాగి ఉన్న "పాపాలను" స్పష్టంగా చూసేలాగ మనకు సహాయం చేస్తుంది (కీర్తనలు 119:11). అప్పుడే మనం దేవుని జ్ఞానం, వెలుగు పైన గురిని నిలుపగలుగుతాం (కీర్తనలు 19:7-11).


• శారీరిక గ్రుడ్డితనానికి కొన్నిసార్లు చికిత్స ఉండకపోవచ్చు, కాని ఆత్మీయ చూపు మెరుగవ్వడానికి ఎప్పుడూ అవకాశం ఉంది.


Blurry Vision or 20/20?


జోనతాన్ గోఫోర్త్ నిజంగానే చైనాకి మిషనరీగా వెళ్ళినప్పుడు 1800 చివర్లో తన చూపును పోగొట్టుకున్నాడా? ఈరోజు వాక్యధ్యానంలో తెలుసుకుందాం!




No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.