యోసేపు చరిత్ర అంటే నాకు చాలా ఇష్టం. నేను బాధాకరమైన కష్టాలలో ఒత్తిడిని అనుభవిస్తున్నపుడు అది నాకొక అద్భుతమైన ఆదరణనిస్తుంది. రో్మీయులకు 8:28 పద్దతి ప్రకారం, మనపట్ల ఇతరులు చేసిన తప్పుల ద్వారా మన ఆత్మలను వర్ధిల్లింపచేసే దేవుని సామర్ధ్యాన్ని ఈ కధలో మనం చూడగలం.
• దేవుడు ఎవ్వరినీ పాపం చేయడానికి శోధించడు, కాని చేసిన పాపాన్ని మంచికి వాడగలడు (యాకోబు 1:13).
తప్పకుండ బాధ ద్వారానే ఎదుగుదల వస్తుంది - యోసేపు అన్నలు, పోతీఫరు భార్య యోసేపుకు గొప్ప శ్రమలే తెచ్చిపెట్టారు. కాని దేవుడు వారి పాపాలను ఉపయోగించి యోసేపుని సరైన స్థలంలోకి, సరైన సమయానికి తెచ్చారు, అంతేకాక లెక్కించలేని అనేకమందికి సహాయం చేయగలిగే సరైన చూపు యోసేపుకి వచ్చింది (ఆదికాండము 50:20).
యోసేపు వారు చేసిన కీడును బట్టి వారిపై పగ తీర్చుకుంటాడేమో అని యోసేపు అన్నలు చాలా భయపడినప్పుడు, యోసేపు ఇలా అన్నాడు, "మీరు నాకు కీడుచేయ నుద్దేశించితిరి గాని నేటిదినమున జరుగుచున్నట్లు, అనగా బహు ప్రజలను బ్రదికించునట్లుగా అది మేలుకే దేవుడు ఉద్దేశించెను". (ఆదికాండము 50:20)
ఇలాంటిదే ఈ మధ్య నా జీవితంలో కూడా దేవుడు చేసినట్టు నాకు చూపించారు - ఒక వ్యక్తి పాపం వలన అతను తీవ్రమైన నొప్పితో కూడిన మరక నా హృదయంపై విడిచిపెట్టాడు. కాని దానివల్ల దేవునితో నా నడకలో నేనెంతో ఎదిగాను, అంతేకాదు అది ఇతరులకు నేను సహాయం చేసేలాగ సహాయపడింది, నూతన అవకాశాలు ద్వారాలుగా నాకోసం తెరువబడ్డాయి (2 కొరింథీయులకు 1:3-5).
నిన్ను ఒక మెరుగైన స్థితికి తీసుకురావడానికి దేవుడు ఇతరుల పాపాలను నీ జీవితంలో కూడా వాడుకున్నాడా? ఈ ఆదికాండము 50:20 చూపు ద్వారా నీకు శాంతి దొరికిందా?
No comments:
Post a Comment
Note: Only a member of this blog may post a comment.