20/20 ఆత్మీయ దృష్టి : "శుభ్రమైన" చూపు

ఈరోజు వాక్యధ్యానం 20/20 ఆత్మీయ దృష్టి యొక్క ప్రాముఖ్యతను అలాగే దానిని ఎలా జాగ్రత్తగా కాపాడుకోవాలో అనే వాటిని మనకు తెలుపుతుంది.



ఆరోగ్యకరమైన, దైవికమైన వాటిపై దృష్టి నిలిపి, మన ప్రతీ ఆలోచనను క్రీస్తుకు లోబడునట్లుగా చెరపట్టాలని దేవుని వాక్యం మనకు బోధిస్తుంది (ఫిలిప్పీయులకు 4:8; 2 కొరింథీయులకు 10:5).


అటువంటి దృష్టిని ఎలా నిలకడగా కాపాడుకోవాలంటే "మన కన్నుల ఎదుట ఏ దుష్కార్యాన్ని ఉంచుకోకూడదు". వాటితో ఎటువంటి పాలు మనకు ఉండకూడదు (కీర్తనలు 101:3).


ఎందుకు? ఎందుకంటే దృశ్యాలు, మాటలు మన ఆలోచనలను, క్రియలను ప్రభావితం చేస్తాయి గనుక. అవి టీవిలో చూసినా, కంప్యూటర్లో చూసినా, లేదంటే ఏదైనా పుస్తకంలో చూసినా సరే, అవి మన ఆత్మీయ చూపును నాశనం చేస్తాయి.


మత్తయి 6:22-23 సరైన "దృష్టిని" కలిగి జీవించడం గురించి చెప్తుంది ఎందుకంటే "దేహమునకు దీపము కన్నే గనుక నీ కన్ను తేటగా ఉండినయెడల నీ దేహమంతయు వెలుగుమయమైయుండును. నీ కన్ను చెడినదైతే నీ దేహమంతయు చీకటిమయమై యుండును; నీలోనున్న వెలుగు చీకటియై యుండిన యెడల ఆ చీకటి యెంతో గొప్పది.


కనుక "నీ కన్నులు ఇటు అటు చూడక సరిగాను నీ కనురెప్పలు నీ ముందర సూటిగాను చూడవలెను. నీవు నడచు మార్గమును సరాళము చేయుము అప్పుడు నీ మార్గములన్నియు స్థిరములగును. (సామెతలు 4:25,26)


~ కనుక ఆరోగ్యకరమైన "శుభ్రమైన" 20/20 ఆత్మీయ దృష్టిని కలిగి ఉండటానికి శ్రద్ద తీసుకుందామా!


20/20 Vision: “Clean” Vision


ఈరోజు వాక్యధ్యానం 20/20 ఆత్మీయ దృష్టి యొక్క ప్రాముఖ్యతను అలాగే దానిని ఎలా జాగ్రత్తగా కాపాడుకోవాలో అనే వాటిని మనకు తెలుపుతుంది.





 


No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.