"నిండిపోయిన బీరువాలు"

"నిండిపోయిన బీరువాలు" అనే ఈరోజు వాక్యధ్యానం, మన గురించి, మన దేవునితో మనకున్న సంబంధం గురించి కొన్ని ముఖ్య విషయాలు వివరిస్తుంది.


మీ బీరువాల్లో మీకు ఖాళీగా ఉన్న అర ఎప్పుడైనా ఉందా?


నాకు కూడా ఎప్పుడూ లేదు.


ఒకవేళ ఏదైనా ఖాళీ స్థలం ఉన్నా, వాటిని ఎపుడైనా పనికొస్తాయేమో అనుకోని అవసరంలేని, పనికిరాని వస్తువులతో నింపేస్తాం.


అచ్చం అలానే మన ఆత్మీయ జీవితంలో కూడా చేస్తూ ఉంటాం. సమయం లేక కాదు నిర్లక్ష్యం వల్లే మన ప్రభువుతో మనం సమయం గడపము. దానికి కారణం ఆయన కంటే తక్కువ ముఖ్యమైన వాటితో ఆ సమయాన్ని నింపుతాం కనుక.


ఇదే విషయం నాకు యిర్మీయా 2:13 చదువుతున్నప్పుడు అనిపించింది :
నా జనులు రెండు నేరములు చేసియున్నారు, జీవజలముల ఊటనైన నన్ను విడిచియున్నారు, తమకొరకు తొట్లను, అనగా బద్దలై నీళ్లు నిలువని తొట్లను తొలిపించుకొనియున్నారు.


దేవునితో మన సంబంధాన్ని నిర్లక్ష్యం చేసినప్పుడల్లా, దాని ఫలితం ఏమిటంటే ఆయన స్థానంలో ఎవరినైనా లేక దేనినైనా నింపివేయడమే.


తరుచూ మన "బీరువాని" దేవునితో సమయానికి బదులు, మనకి అవసరం అవుతాయేమో అనుకోని అవసరం లేని వాటితో నింపేస్తాం.


మన బీరువాలో అవసరమైనది ఒక్కటే అని ప్రభువు చెప్పారు.


ఆయన ఏమి చెప్పారో నీకు తెలుసా?


అందుకు ప్రభువు మార్తా, మార్తా, నీవనేకమైన పనులను గూర్చి విచారము కలిగి తొందరపడుచున్నావు గాని అవసరమైనది ఒక్కటే. మరియ ఉత్తమమైనదానిని ఏర్పరచుకొనెను, అది ఆమె యొద్దనుండి తీసివేయబడదని ఆమెతో చెప్పెను. (లూకా 10:41,42)


పూర్తి సందర్భం కొరకు "లూకా 10:38-42" చదవండి.


"Full Closets"



"నిండిపోయిన బీరువాలు" అనే ఈరోజు వాక్యధ్యానం, మన గురించి, మన దేవునితో మనకున్న సంబంధం గురించి కొన్ని ముఖ్య విషయాలు వివరిస్తుంది.



No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.