దేవుడు మన జీవితాలలో నిరంతరం పనిచేస్తూనే ఉంటాడు.
మన హృదయ స్థితి, మన పరిస్థితుల యొక్క పూర్తి జ్ఞానం ఆయనకుంది. ఆయన ఒకోసారి మంచి కారణాలకే ఆలస్యాలను లేక చుట్టు దారిని సిద్దపరుస్తూ ఉంటాడు.
దేవుని వాక్యం నుండి దానికొక అద్భుతమైన ఉదాహరణ :
మరియు ఫరో ప్రజలను పోనియ్యగా దేవుడు ఈ ప్రజలు యుద్ధము చూచునప్పుడు వారు పశ్చాత్తాపపడి ఐగుప్తుకు తిరుగుదురేమో అనుకొని, ఫిలిష్తీయులదేశము సమీపమైనను ఆ మార్గమున వారిని నడిపింపలేదు. అయితే దేవుడు ప్రజలను చుట్టుదారియగు ఎఱ్ఱసముద్రపు అరణ్యమార్గమున నడిపించెను. ఇశ్రాయేలీయులు యుద్ధ సన్నద్ధులై ఐగుప్తులోనుండి వచ్చిరి. (నిర్గమకాండము 13:17,18)
వారు సిద్ధంగా లేరు గనుక దేవుడు వారిని ఆ దారిలోకి నడిపించలేదు.
అదేవిధంగా, ఆయన చిత్తాన్ని చేయనీయకుండా అడ్డుకోవడానికి మన మార్గంలో పొంచియున్న ప్రమాదాలు లేక గురి నుండి మన దృష్టిని తొలగించే అవరోధాలు ఏమి ఉన్నాయో దేవునికే తెలుసు.
నీవు నడిచే మార్గం సుదీర్ఘంగా ఉందని, తిన్నగా లేదని ఆశ్చర్యంతో తిరుగులాడుతూ ఉన్నావా? నీ సమయం వృధా అవుతుందని నీకు అనిపిస్తూ ఉందా?
నువ్వు క్రీస్తుకి విధేయత చూపే వ్యక్తివైతే, ఆ నడకను కొనసాగించమనే నిన్ను నేను ప్రోత్సాహిస్తున్నాను. చుట్టు దారులకు, ఆలస్యాలకు ఆయన దగ్గర మంచి కారణాలే ఉంటాయి (కీర్తనలు 32:8).
Sometimes God Plans Detours & Delays
No comments:
Post a Comment
Note: Only a member of this blog may post a comment.