✨️ప్రియ ప్రభువా, మాకు దయచేయి :
1. ఈ లోకాన్ని దాటి నిత్యత్వంలోకి చూచే కనులు.
నీవు దానిమీద దృష్టి నిలిపినతోడనే అది లేకపోవును నిశ్చయముగా అది రెక్కలు ధరించి యెగిరిపోవును. పక్షిరాజు ఆకాశమునకు ఎగిరిపోవునట్లు అది ఎగిరిపోవును. (సామెతలు 23:5)
2. స్వచ్ఛమైన కనులు.
నా కన్నులయెదుట నేను ఏ దుష్కార్యమును ఉంచుకొనను భక్తిమార్గము తొలగినవారి క్రియలు నాకు అసహ్యములు అవి నాకు అంటనియ్యను (కీర్తనలు 101:3)
3. వాక్యంలో దాగివున్న అద్భుతమైన వాటిని చూచే కనులు.
నేను నీ ధర్మశాస్త్రమునందు ఆశ్చర్యమైన సంగతులను చూచునట్లు నా కన్నులు తెరువుము. (కీర్తనలు 119:18)
4. ప్రస్తుతం ఉన్న పరిస్థితులను దాటి దూర దృష్టి చూచే కనులు.
మేము దృశ్యమైనవాటిని చూడక అదృశ్యమైనవాటినే నిదానించి చూచుచున్నాము గనుక క్షణమాత్రముండు మా చులకని శ్రమ మాకొరకు అంతకంతకు ఎక్కువగా నిత్యమైన మహిమ భారమును కలుగజేయుచున్నది. ఏలయనగా దృశ్యమైనవి అనిత్యములు; అదృశ్యమైనవి నిత్యములు. (2 కొరింథీయులకు 4:17,18)
5. మా ముందే అవసరంలో ఉన్న వారిని చూడగలిగే దగ్గర చూపు చూచే కనులు.
మీలో ప్రతివాడును తన సొంతకార్యములను మాత్రమేగాక యితరుల కార్యములను కూడ చూడవలెను. (ఫిలిప్పీయులకు 2:4)
6. నూతనపరచబడిన కనులు.
ఆయన క్రీస్తునందు వినియోగపరచిన బలాతిశయమునుబట్టి విశ్వసించు మనయందు ఆయన చూపుచున్న తన శక్తియొక్క అపరిమితమైన మహాత్మ్యమెట్టిదో, మీరు తెలిసికొనవలెనని, మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క దేవుడైన మహిమ స్వరూపియగు తండ్రి, తన్ను తెలిసికొనుటయందు మీకు జ్ఞానమును ప్రత్యక్షతయునుగల మనస్సు అనుగ్రహించునట్లు, నేను నా ప్రార్థనలయందు మిమ్మును గూర్చి విజ్ఞాపన చేయుచున్నాను. (ఎఫెసీయులకు 1:18,19)
కనుక మన ఆత్మీయ కళ్ళద్దాలు పెట్టుకోని, దేవుని వాక్యంలో దాగియున్న అద్భుతమైన ఆశ్చర్యకరమైన సత్యాలపై మన దృష్టి నిలుపుదామా!
Asking God for 20/20 Spiritual Vision
No comments:
Post a Comment
Note: Only a member of this blog may post a comment.