జీవితం మనకు అన్యాయం, రోగాలు, గాయాలు, ఆర్ధిక సమస్యలు, అనుకోని మరణాలు ఇలా ఇంకా ఎన్నెన్నో వేల సమస్యలను తీసుకొస్తుంది.
దేవుడు మనకు దుఃఖం లేని సమస్యలు లేని జీవితాలను ఇస్తానని వాగ్దానం చేయలేదు (యోహాను 16:33).
విచారం ఏమిటంటే, తరచూ మనము ఈ లోక కష్టాలను అతిగా అంచనా వేస్తూ, నిత్యమైన శాశ్వతమైన ఆశీర్వాదాలను చాలా తక్కువ అంచనా వేస్తాము.
కాని 20/20 ఆత్మీయ దృష్టి ఉన్న క్రైస్తవులు, ప్రస్తుత పరిస్థితులను మించి చూడగలరు, వారు దూరదృష్టి ఉన్నవారు. ఈ లోక కష్టాలను వారు "క్షణమాత్రం ఉండే చులకని శ్రమలుగా" చూస్తారు, అందుకే దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటినే నిదానించి చూస్తారు (2 కొరింధీయులకు 4:18).
పాత నిబంధనలో ఉన్న పరిశుద్ధుల వలే, ఈ భూమి మీద వారు "యాత్రికులు పరదేశులని" గ్రహించినవారై, శాశ్వతమైన పరలోక వాగ్దానాలపై దృష్టి నిలుపుతారు (హెబ్రీయులకు 11:13).
వారికి వారు నిరీక్షించే దానిపై విశ్వాసం ఉంది, అదృశ్యమైనవి చూస్తాము అనే నిశ్చయత ఉంది (హెబ్రీయులకు 11:1).
ప్రస్తుతం మనం చూస్తున్న కష్టాలను లేక సుఖాలను ఎలా చూడాలో అలానే వాటిని చూడటానికే జాగ్రత్తపడదాం. అవి అశాశ్వతమైనవి. మన భవిష్యత్తు క్రీస్తులోనే ఉంది అనే సత్యాన్ని చూడడంలో జాగ్రత్తపడదాం. ఎందుకంటే అదే శాశ్వతమైనది.
20/20 Spiritual Vision: Being "Farsighted"
No comments:
Post a Comment
Note: Only a member of this blog may post a comment.