20/20 చూపు : నూతనపరచబడిన కనులు

మనం 20/20 ఆత్మీయ దృష్టిని పొందాలి అంటే ఈ మూడు విషయాలు మనం అర్ధంచేసుకోవాలి!


20/20 ఆత్మీయ దృష్టిని పొందటానికి ఒక అద్భుతమైన ప్రార్ధన ఎఫెస్సీయులకు 1:17-19 లో మనం చూడగలం :


మరియు మీ మనో నేత్రములు వెలిగింపబడినందున, ఆయన మిమ్మును పిలిచిన పిలుపువల్లనైన నిరీక్షణ యెట్టిదో, పరిశుద్ధులలో ఆయన స్వాస్థ్యముయొక్క మహిమైశ్వర్యమెట్టిదో, ఆయన క్రీస్తునందు వినియోగపరచిన బలాతిశయమునుబట్టి విశ్వసించు మన యందు ఆయన చూపుచున్న తన శక్తియొక్క అపరిమితమైన మహాత్మ్యమెట్టిదో, మీరు తెలిసికొనవలెనని, మన ప్రభువైన యేసుక్రీస్తుయొక్క దేవుడైన మహిమ స్వరూపియగు తండ్రి, తన్ను తెలిసికొనుటయందు మీకు జ్ఞానమును ప్రత్యక్షతయునుగల మనస్సు అనుగ్రహించునట్లు, నేను నా ప్రార్థనలయందు మిమ్మునుగూర్చి విజ్ఞాపన చేయుచున్నాను. (ఎఫెసీయులకు 1:17-19)


యేసు పై గురి ద్వారా :


1. మనకు నిరీక్షణ ఉంది.
ఈ నిరీక్షణ నిశ్చలమును, స్థిరమునై, మన ఆత్మకు "లంగరువలె" నుండి తెరలోపల ప్రవేశించుచున్నది. (హెబ్రీయులకు 6:19)


2. మనకు నిజమైన ఆత్మీయ ఐశ్వర్యం ఉంది.
మన ఐశ్వర్యం అయిన విమోచన, క్షమాపణ, జ్ఞానం, జీవిత సంకల్పం యేసులోనే దొరుకుతాయి (ఎఫెసీయులకు 1:7-14)


3. మనకు ఆత్మ శక్తి ఉంది.
మన సొంత శక్తి మీద మనం ఆధారపడం ఎందుకంటే "ప్రభువు యొక్క మహాశక్తిని బట్టే మనం బలవంతులముగా ఉండగలం", ఆ బలాతిశయమే క్రీస్తును మృతులలో నుండి లేపిన శక్తి (ఎఫెసీయులకు 6:10; ఎఫెసీయులకు 1:18-20).


• కనుక, ప్రియమైన క్రైస్తవులారా, మనకున్న నిరీక్షణ, ఐశ్వర్యం, శక్తిని అర్ధంచేసుకున్నవారముగా "విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైన యేసువైపు చూచుచు, మన యెదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరుగెత్తుదము. (హెబ్రీయులకు 12:1-2)


20/20 Vision: Renewed Eyes


మనం 20/20 ఆత్మీయ దృష్టిని పొందాలి అంటే ఈ మూడు విషయాలు మనం అర్ధంచేసుకోవాలి!


No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.