20/20 ఆత్మీయ దృష్టి ఉన్న క్రైస్తవులు కేవలం ప్రస్తుత పరిస్థితులను దాటి చూడగలిగే దూర దృష్టి ఉన్నవారు మాత్రమే కాదు, వారి చుట్టూ ఉండేవారి అవసరాలు చూడగలిగే దగ్గర చూపు ఉన్నవారు కూడా అయివుండాలి.
అందరూ స్వార్ధపరులుగా జీవిస్తున్న సమాజంలో మనం ఉంటున్నాం. కనుక మనకు సన్నిహితంగా ఉన్న వారి అవసరాలను మనం నిర్లక్ష్యం చేస్తుంటాం, అంటే ఉదాహరణకు: వృద్ధులైన తల్లిదండ్రులు, అనారోగ్యంతో ఉన్న పక్కింటివారు, ఇబ్బందుల్లో ఉన్న తోటి ఉద్యోగులు, నష్టాల్లో ఉన్న కుటుంబ సభ్యులు.
లోకానుశారమైన క్రైస్తవులు ఇతరుల అవసరాలు నిర్లక్ష్యం చేస్తూ ఉండటమే కాక, బాధల్లో ఉన్న వారిని ఇంకా బాధపెడుతూ ఉంటారు. ఎందుకంటే వారిమీదే వారు దృష్టి నిలుపుతారు కాబట్టి.
కాని దేవుడు మనలను ఉన్నతమైన దానికోసం పిలుచుకున్నాడు. మనలను మనం ఉపేక్షించుకోవడం, మన జీవితాలను మనం పోగొట్టుకోవడం (మత్తయి 16:24-26) కోసం మనలను పిలుచుకున్నాడు. ఎందుకంటే మన సహజ స్వభావం మన సొంత విషయాలనే మనం పట్టించుకుంటూ, ఇతరుల అవసరాలను నిర్లక్ష్యం చేయడం అని ఆయనకు తెలుసు.
తనను తాను త్యాగం చేసుకున్న ఉన్నతమైన ఉదాహరణ మన ప్రభువే. మన దగ్గరకు వచ్చి మనలను రక్షించడానికి ఆయన తనను తాను ఎంతగానో తగ్గించుకున్నాడు (ఫిలిప్పీయులకు 2:3-7).
మన స్వార్ధపూరిత ఉద్దేశాలను విడిచి, దేవుని ఉద్దేశాలను వెతకగలిగితే, మన జీవితం యొక్క నిజమైన అర్ధం మనం తెలుసుకోగలం (మత్తయి 16:24-26).
ఈ క్రింది వాక్యభాగాలను ధ్యానించాడానికి కొంత సమయాన్ని తీసుకోని, ఆత్మీయ దృష్టిలో మెరుగవుదామా :
• అప్పుడు యేసు తన శిష్యులను చూచి ఎవడైనను నన్ను వెంబడింపగోరిన యెడల, తన్నుతాను ఉపేక్షించుకొని, తన సిలువనెత్తికొని నన్ను వెంబడింపవలెను. తన ప్రాణమును రక్షించుకొనగోరువాడు దాని పోగొట్టుకొనును; నా నిమిత్తము తన ప్రాణమును పోగొట్టుకొనువాడు దాని దక్కించుకొనును. ఒక మనుష్యుడు లోకమంతయు సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకొంటే అతనికేమి ప్రయోజనము? ఒక మనుష్యుడు తన ప్రాణమునకు ప్రతిగా నేమియియ్యగలడు? (మత్తయి 16:24-26)
• కక్షచేతనైనను వృథాతిశయము చేతనైనను ఏమియు చేయక, వినయమైన మనస్సుగలవారై యొకనినొకడు తనకంటె యోగ్యుడని యెంచుచు మీలో ప్రతివాడును తన సొంతకార్యములను మాత్రమేగాక యితరుల కార్యములను కూడ చూడవలెను. క్రీస్తుయేసునకు కలిగిన యీ మనస్సు మీరును కలిగియుండుడి. ఆయన దేవుని స్వరూపము కలిగినవాడైయుండి, దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని యెంచుకొనలేదు గాని మనుష్యుల పోలికగా పుట్టి, దాసుని స్వరూపమును ధరించుకొని, తన్ను తానే రిక్తునిగా చేసికొనెను. (ఫిలిప్పీయులకు 2:3-7)
No comments:
Post a Comment
Note: Only a member of this blog may post a comment.