20/20 ఆత్మీయ దృష్టి : లేఖనాల విలువను చూడటం

మనకు 20/20 ఆత్మీయ దృష్టి కావాలంటే, దేవుని వాక్యం గురించి ఈ విషయాన్ని అర్ధంచేసుకోవాలి.


వాక్యధ్యానాలు వ్రాసే ప్రాఖ్యాతిగాంచిన ఒక రచయిత్రి, బైబిల్లోని వాక్యాలకంటే ఇంకా ఎక్కువ కావాలనే ఆత్రుతతో తన సొంత పుస్తకాలు వ్రాయడం మొదలుపెట్టింది. (1)


యదార్ధంగా చెప్పాలంటే ఆమె వైఖరి నన్ను చాలా కలవరపెడుతుంది.


నాకు సెమినరి నుండి మాస్టర్ డిగ్రీ ఉంది, నలభై ఏళ్ళకంటే పైనే నేను లేఖనాలను చదివాను. కాని దేవుని వాక్యంలో ఉన్న నిధిని త్రవ్వడం ఇప్పుడే మొదలుపెట్టాననే చెప్పొచ్చు.


20/20 ఆత్మీయ దృష్టి కావాలంటే, ఆయన ధర్మశాస్త్రంలో ఆశ్చర్యకరమైన సంగతులు చూడగలిగేలాగా మన 'కన్నులను తెరువమని' దేవుణ్ణి అడగాలి (కీర్తనలు 119:19). మనుషుల మాటలకంటే దేవుని మాటలే మనం నమ్ముకోవాలి.


ఎందుకంటే :


1. బైబిల్లో ప్రతీ లేఖనము దైవావేశం వలన కలిగినదే (2 తిమోతి 3:16-17).


2. అది మనకు విశ్వాసాన్ని కలిగిస్తుంది (రో్మీయులకు 10:17).


3. అది దేవునికి అనుకూలమైనదానిని తప్పక నెరవేస్తుంది (యెషయా 55:10-11).


4. అది పరిపూర్ణమైనది (కీర్తనలు 19:7-11).


5. అది సజీవమైనది (హెబ్రీయులకు 4:12).


మనకు కచ్చితంగా దేవుని వాక్యం అంటే ఆత్రుత ఆకలి ఉండాలి, కాని ఆ వాక్యం కంటే ఇంకేదో కావాలనే ఆత్రుత మాత్రం ఉండకూడదు!


♥♥♥♥♥♥♥♥♥♥♥♥


(1) దేవుని వాక్యంకంటే ఇంకా ఎక్కువ కావాలని ఈ రచయిత్రి చెప్తుందంటే, ఆమె ప్రార్ధన, సహవాసం అనే ఆత్మీయ క్రమశిక్షణల ఆత్రుత గురించి మాట్లాడట్లేదు. నిజం చెప్పాలంటే, ఆ ఆత్మీయ క్రమశిక్షణల కంటే ఆమె పుస్తకాలే ఆమె ఆత్మీయ జీవితానికి ఎక్కువ లాభకరంగా ఉందని ఆమె ఉద్దేశం. అంతే కాదు వ్యక్తిగతంగా దేవుని నడిపింపు, ప్రేరేపణ గురించి కూడా ఆమె చెప్పట్లేదు. మన వ్యక్తిగత అనుదిన జీవితాల్లో దేవుని నడిపింపు అడగటం తప్పనిసరి, అది చాలా ముఖ్యం.

కాని ఈ రచయిత్రి ఏమి ప్రాస్థావిస్తుందంటే, ఈ లోకానికి పంచాడానికి యేసయ్య నుండి ఆమె సందేశాలను తీసుకుంటుందని. కాని నా ఆందోళన ఏమిటంటే చాలా మంది క్రైస్తవులు ఈమె మాటలనే దేవుని మాటలుగా భావిస్తున్నారు, దేవుని మాటలు ఉన్న బైబిల్ బదులు ఈమె మాటలు మాత్రమే చదువుతున్నారు.


20/20 Vision: Seeing the Value of Scripture


మనకు 20/20 ఆత్మీయ దృష్టి కావాలంటే, దేవుని వాక్యం గురించి ఈ విషయాన్ని అర్ధంచేసుకోవాలి.



No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.