"దేవుని కనుపాప" అంటే అర్ధం ఏమిటి?

"నా కనుపాప" అంటే మనకు అమూల్యమైనవారు అని మీకు బహుశా తెలిసేవుంటుంది. కాని ఎందుకు? ఈ విషయాన్ని ఈరోజు వాక్యాధ్యానంలో చూద్దాం!

"నా కనుపాప లేక కనుగుడ్డు" అంటే ఎవరైనా మనకు అమూల్యమైన వారుగా ఉంటే వారిని అలా భావిస్తాం అనే విషయం అందరికీ తెలుసు.


గుడ్డు కంటిలో ఒక భాగం :


• అది చిన్న స్పర్శకు కూడా చలించిపోయే చాలా సున్నితమైనది.

• చిన్న చిన్న పదార్ధాల వల్ల కూడా సులభంగా దానికి హాని కలగొచ్చు.

• ఒకవేళ దానికి ప్రమాదం జరిగితే బాగవ్వడం కష్టం.


సహజంగా మన శరీరంలో ఉన్న అన్ని అవయవాలకంటే మన కన్నులను మనం ఎక్కువ కాపాడుకుంటాం, సంరక్షించుకుంటాం.


సర్ వాల్టర్ స్కోట్ అనే వ్యక్తి షేక్ స్పీయర్ వ్రాసిన మిడ్ సమ్మర్ అనే వ్యాసంలో నుండి "కనుపాప" అనే పదాన్ని తీసుకోని 200 సంవత్సరాల తరువాత తన రచనల్లో వ్రాస్తే, అది చాలా ప్రసిద్ధికెక్కింది. కాని ఆ మాట మొట్టమొదట వ్రాయబడింది బైబిల్లోనే.


కీర్తనలు 17:9 లో దావీదు "తనను కనుపాప వలే కాపాడమని" దేవుణ్ణి అడుగుతాడు. ద్వితీయోపదేశకాండము 32:10, జెకర్యా 2:8 లో దేవుడు తన ప్రజలను "తన కనుపాప" అని పిలిచాడు.


క్రైస్తవులముగా మనమే దేవుని కానుపాపలము. ఒక్కసారి ఆలోచిద్దాం. తన సృష్టి మొత్తంలో మనమే దేవునికి అత్యధిక ప్రాధాన్యత... ఆయన స్వరూపంలో చేయబడ్డాం. ఆయన మనలను కాపాడతారు, మన కోసం మన గురించి ఎంతో పట్టించుకునే దేవుడు ఆయన.


ఈ విశ్వం అంతటిలో మనమే దేవునికి అమూల్యమైనవారం. ఇది ఎంత అద్భుతం!


What It Means to be "The Apple of God's Eye"


"నా కనుపాప" అంటే మనకు అమూల్యమైనవారు అని మీకు బహుశా తెలిసేవుంటుంది. కాని ఎందుకు? ఈ విషయాన్ని ఈరోజు వాక్యాధ్యానంలో చూద్దాం!



No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.