విత్తనంలో సమస్య లేదు

విత్తువాని ఉపమానం గురించి ఆసక్తికర విషయాలు. ఈరోజు వాక్యధ్యానం ద్వారా "రాతినేలవంటి మనుషులు నిన్ను నిరాశపరచనీయకు" అనే అంశాన్ని చూద్దాం.

మత్తయి 13:1-23, లూకా 8:4-15, మార్కు 4:1-20 లో యేసు ప్రభువు విత్తువాని ఉపమానం చెబుతూ దేవుని మాటలు వినే నాలుగు రకాల మనుషులు గురించి వివరించారు.


చెప్పిన మొదటి గుంపులో వాళ్ళు దేవుని వాక్యం వింటారు కాని వారి హృదయాలు మాత్రం రాతినేలలవలే ఉంటాయి. వాక్యవిత్తనం పైనే పడి ఉంటుంది గనుక త్రోక్కబడుతుంది లేదా ఒక పక్షి వచ్చి ఎలా దానిని మింగేస్తుందో అలా సాతానుడు దొంగలిస్తాడు.


పక్షులకు విత్తనాలు అంటే ఇష్టం గనుక వాటిని దొంగలిస్తాయి. కాని సాతానుకు దేవుని వాక్యం అంటే ద్వేషం గనుక వాక్యాన్ని దొంగలిస్తాడు.


దేవుని వాక్యం సజీవమైనది (హెబ్రీయులకు 4:12), పరిపూర్ణమైనది (కీర్తనలు 19:7), దైవావేశం వలన కలిగినది (2 తిమోతి 3:16), శాశ్వతమైనది (కీర్తనలు 119:89), తీయనిది, వెలకట్టలేనిది (కీర్తనలు 19:10) అని తెలిసినప్పటికీ కొంతమంది దేవుని వాక్యాన్ని పూర్తిగా తృణీకరిస్తారు అనే సత్యాన్ని మనం తెలుసుకోవాలని యేసు ప్రభువు ఆశిస్తున్నారు.


కాని ఇలా రాతినేలవలే కొందరు ఉంటారు అనే విషయం సువార్తను ప్రకటించకుండా ఆగిపోయేలా మనలను నిరాసపరచనీయకూడదు.


ఎందుకంటే సమస్య విత్తనంలో లేదు. సమస్య అంతా నేలలోనే.


The Seed is Not the Problem


విత్తువాని ఉపమానం గురించి ఆసక్తికర విషయాలు. ఈరోజు వాక్యధ్యానం ద్వారా "రాతినేలవంటి మనుషులు నిన్ను నిరాశపరచనీయకు" అనే అంశాన్ని చూద్దాం.



No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.