రాతినేలవంటి "విశ్వాసం"

రాతినేల వంటి మనుషులు: ఈరోజు వాక్యధ్యానాన్ని చదివి మీకు ఇలాంటి వారు ఎవరైనా తెలుసేమో ఆలోచించండి.


మన్ను లోతుగా లేక కేవలం రాతిని కప్పేఅంతే ఉండి అక్కడ విత్తిన విత్తనాలు "సంతోషంతో" మొలవడం, సూర్యుడు ఉదయించగానే వేరు లోతుగా లేదు గనుక అవి ఒడిలిపోయి మాడిపోవడం అనే దృశ్యాన్ని ఒకసారి ఊహించండి.


విత్తువాని ఉపమానంలో (మత్తయి 13:1-23, లూకా 8:4-15, మార్కు 4:1-20) విత్తనాలు తీసుకున్న ఇలాంటి నేలల వంటి మనుషుల గురించే యేసు ప్రభువు మాట్లాడారు.


వారు సంతోషంతో దేవుని వాక్యాన్ని స్వీకరిస్తారు కాని పరీక్షకు గురైనప్పుడు వెంటనే పడిపోతారు.


వారికి రక్షణ వల్ల వచ్చే లాభాలు కావాలి గాని అందులో ఉన్న బాధ్యతలు మాత్రం వద్దు. ఏ వాక్యాన్నైతే వారు సంతోషంతో స్వీకరించారో, ఆ వాక్యం ఆశించేది మాత్రం ఇవ్వడానికి నిరాకరిస్తారు. (1)


బహుశా ఈ సంస్కృతిలో ప్రసిద్ధి కాని వాక్యానుశారమైన బోధ పక్షాన నిలబడినందుకు వారిని జనాలు వెక్కిరిస్తున్నారేమో. బహుశా సువార్తను ప్రకటిస్తున్నందుకు వారు తిరస్కరించబడుతున్నారేమో. లేదా బహుశా ఒక క్రైస్తవ స్నేహితుడు వారి పాపాలు గురించి వీరితో ఘర్షణ పడుతున్నారేమో.


మనుషుల్లో వారికి గొప్పపేరు పోతుంది అని లేదా వారు తమ జీవన విధానాన్ని మార్చుకోవాల్సి వస్తుంది అనే వాటిని వారు ఎప్పుడైతే కనుగొంటారో అప్పటి నుండి మొదట వారికుండిన సంతోషం క్రమంగా అదృశ్యం అవ్వడం మొదలవుతుంది.


లోతులేని రాతినేలల వంటివారు, రక్షణ వెలతో కూడినది అనే విషయాన్ని అర్ధంచేసుకోలేరు (లూకా 14:25-35).


అలానే క్రీస్తును వెంబడించినందువల్ల వచ్చే నమ్మశక్యం కాని అపురూపమైన ప్రతిఫలాన్ని కూడా వారు అర్ధంచేసుకోలేరు (1 థెస్సలోనిక 5:23-24).


ఇలాంటి రాతినేలలవంటి మనుషులు యేసు యొక్క ప్రేమను తెలుసుకోవాలని అర్ధంచేసుకోవాలని ప్రార్ధిద్దాం.


-------------


(1) లూకా లో 'శోధన' అని వ్రాయబడితే  మత్తయి మరియు మార్కులో 'శ్రమ' అని వ్రాయబడింది.


Rocky-Ground "Faith"


రాతినేల వంటి మనుషులు: ఈరోజు వాక్యధ్యానాన్ని చదివి మీకు ఇలాంటి వారు ఎవరైనా తెలుసేమో ఆలోచించండి.


No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.