ముండ్లపొదలతో అణచివేయబడుతున్నావా?

మనుషుల జీవితాల్లో ఉండే ముండ్లు గురించి యేసు చెప్పిన మాటల అర్ధాన్ని ఈరోజు వాక్యధ్యానంలో చూద్దాం. ఇలాంటివి మీలో ఉంటే వెంటనే తీసేయడానికి ఈ ధ్యానవాక్యం మిమ్మల్ని ప్రోత్సాహించనీయండి!


ముండ్ల పొదలు : వాటికి ఎలాంటి విలువా లేదు, కాని అవి స్థలాన్ని ఆక్రమిస్తాయి, నీటిని, సూర్యకాంతిని, నేలలో ఉండే పోషకాలను అన్నింటినీ దోచేసుకుంటాయి. అవి పెద్ద అయ్యేకొద్దీ వాటిని పీకడం చాలా కష్టం అయిపోతుంది.


ఇహలోక ఐశ్వర్యాలు, ఇహలోక విచారాలు మన హృదయాల్లో ఉన్న దేవుని వాక్యవిత్తనం ఫలించకుండా నిష్ఫలం అయ్యేలాగా అణచివేస్తాయని చెప్పడానికి యేసు ఈ పై పోలికను ఉపయోగించడంలో ఆశ్చర్యంలేదు.


ఈ లోకమునైనను లోకములో ఉన్నవాటినైనను ప్రేమింపకుడి. ఎవడైనను లోకమును ప్రేమించినయెడల తండ్రి ప్రేమ వానిలో నుండదు. (1 యోహాను 2:15)


ఇవి చాలా శక్తిగల మాటలు... సత్యమైనవి.


ఎవడును ఇద్దరు యజమానులకు దాసుడుగా నుండనేరడు; అతడు ఒకని ద్వేషించియొకని ప్రేమించును (మత్తయి 6:24)


క్రైస్తవులంగా మనం ఈ ముండ్లను గనుక పోషిస్తే, అవి మనలో ఫలించే శక్తిని, సామర్ధ్యాన్ని, చంపేస్తాయి. విశ్వాసంలో ఎక్కటికీ పరిపూర్ణలం కాలేం.


ఒక తోటమాలి ఎలాగైతే క్రమంగా తోటలో పెరిగే ముండ్లపొదలను పీకేస్తు ఉంటాడో, మనం కూడా మన హృదయాల్లో పెరుగుతున్న ముండ్లపొదలను గుర్తించి, వాటిని వెంటనే పీకేయాలి.


అలాంటి "ముండ్లపొదలను" ఈరోజే పీకేయడానికి నీవు సిద్ధంగా ఉన్నావా?


Are You Choking on Thorns?


మనుషుల జీవితాల్లో ఉండే ముండ్లు గురించి యేసు చెప్పిన మాటల అర్ధాన్ని ఈరోజు వాక్యధ్యానంలో చూద్దాం. ఇలాంటివి మీలో ఉంటే వెంటనే తీసేయడానికి ఈ ధ్యానవాక్యం మిమ్మల్ని ప్రోత్సాహించనీయండి!


No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.