విత్తువాని ఉపమానంలో, త్రోవ పక్కన పడిన, రాతినేలవంటి వారు దేవుని వాక్యాన్ని తృణీకరిస్తారు.
ముండ్ల పొదలవంటివారిని గుర్తుపట్టడం కష్టం. వారు అవిశ్వాసులు కావొచ్చు, లేక 1 కొరింథీయులకు 3:9-15 లో వర్ణించిన ప్రకారం, లోకాశల కోసం తమ జీవితాన్ని వృధా చేసుకుంటూ, పరసంబంధమైన ప్రతిఫలాలను పోగొట్టుకునే నాణ్యత లేని క్రైస్తవులు కావొచ్చు. (1)
పరిపూర్ణతలోనికి ఎదిగాలనుకునే నిజమైన క్రీస్తు అనుచరులు "మంచి నేలవంటివారు".. వీరు విత్తబడిన దానికి ఎన్నో రెట్లు ఫలింపునిచ్చేవారు (లూకా 8:15).
విత్తనాలతో ఉన్న మంచి నేలవంటివారు, విన్న వాక్యాన్ని గట్టిగా పట్టుకుని, బహుగా ఫలించే వరుకు ఓర్పు పట్టుదల కలిగుండే ఉన్నతమైన మంచి హృదయం కలిగినవారు.
ఇలాంటి క్రైస్తవులు సమర్ధవంతముగా ఫలించేవారు, (మత్తయి 13:23) ఎందుకంటే వీరు :
1. వాక్యం సరిగ్గా అర్ధంచేసుకునే నైపుణ్యతను పెంచుకుంటారు (2 తిమోతి 2:15) (2)
2. అర్ధంచేసుకున్నదానికి విధేయత చూపుతారు (యాకోబు 1:22).
3. దైవికమైన సహవాసాన్ని కోరుకుంటారు (హెబ్రీయులకు 10:25; 1 థెస్సలోనిక 5:11).
4. క్రీస్తులో ఎదగాలి అనే ధ్యేయాన్ని తీవ్రంగా తీసుకుంటారు (ఫిలిప్పీ 2:12,13).
---------------------
(1) ఎవరు విశ్వాసులో ఎవరు అవిశ్వాసులో దేవునికే తెలుసు, కాని ఎవరైతే లోకానుశారమైన విలువలు (లోకాసలు) కోసం జీవిస్తున్నారో, ఒక క్రైస్తవుడు జీవించాల్సిన మార్గం అది కాదని వారికి తప్పకుండ చెప్పి హెచ్చరించాలి.
(2) వాక్యాన్ని సరిగ్గా అర్ధంచేసుకోవడం అత్యంత ప్రాముఖ్యమైనది, ఎందుకంటే ప్రస్తుత క్రైస్తవ సమాజంలో సత్యాన్ని సగం బోధించడం (అసత్యం) సాధారణమైపోతున్న రోజుల్లో మనం ఉన్నాం.
4 Things Productive Christians do


No comments:
Post a Comment
Note: Only a member of this blog may post a comment.