దేవుని ప్రేమ కారణంలేనిది

అవును! దేవుడు పూర్తిగా కారణం లేనివాడు. ఆయన్ని సమర్ధించేముందు, ఈరోజు వాక్యధ్యానం చదువు!


దేవుడు కారణాలు పెట్టుకునేవాడు కాడు!


10 ఆజ్ఞలు ఇవ్వబడిన సందర్భాన్ని చదవండి (నిర్గమకాండము 20, 24, 32).


దేవుడు ఎంతో జాగ్రత్తగా, ప్రేమతో ఆ ప్రజలను హెచ్చరించడం మనం చూస్తాం : ఎలాగంటే


• వారిని ఆయన "విలువైన సొత్తుగా" పిలవడం.


• ఉరుములు, మెరుపులు, మహిమ ద్వారా ఆయన శక్తిని వారికి ప్రత్యేకంగా బయలుపరచడం.


• 10 ఆజ్ఞలు వారికి గట్టిగా చదివి వినిపించడం.


దేవుని ఆజ్ఞలు మోషే ద్వారా నిర్ధారించడం :


• వాటిని వ్రాసి మళ్ళీ మళ్ళీ ఆ ప్రజలకు చదివి వినిపించడం.


• ఆ ప్రజలపై రక్తాన్ని ప్రోక్షించడం ద్వారా దేవుని వాగ్దానాలను ఎప్పటికప్పుడు గుర్తుచేయడం.


ప్రజలు :


• దేవుడు చెప్పింది చేస్తామని మూడు వేరు వేరు సందర్భాలలో మాట ఇచ్చారు.


అప్పుడు మోషే పర్వతం పైకి వెళ్లడం, దేవుని మహిమ 'దహించు అగ్నిగా' అక్కడ నిలిచి ఉండటం జరుగుతుంది. కాని 40 రోజుల వ్యవధిలోనే, ఇశ్రాయేలు ప్రజలు బంగారు దూడను చేసుకుని, దేవుడుగా దానిని ఆరాధించడం మొదలుపెడతారు.


కారణంలేని తిరుగుబాటు!


కానీ ఆ కారణం లేని తిరుగుబాటు దేవునికి ఉన్నంత కారణంలేనిదైతే కాదు. అంతటి కఠినులైన ప్రజలను ఆయన ఇంకా అదే ప్రేమతో ప్రేమిస్తూనే, వాగ్దాన భూమికి నడిపిస్తూనే ఉన్నాడు.


మానవ చరిత్రకు ఇది ఎంత ఖచ్చితంగా అద్దంపట్టినట్టు ఉందో కదా... నీ చరిత్ర, నా చరిత్ర... మన కారణం లేని తిరుగుబాటు, దేవుని కారణం లేని ప్రేమ. ఇంత కారణం లేనివాడుగా మన దేవుడు ఉన్నందుకు ఆయన్ని ఈరోజు ఆరాధిద్దామా!


God's Love is Unreasonable

 

అవును! దేవుడు పూర్తిగా కారణం లేనివాడు. ఆయన్ని సమర్ధించేముందు, ఈరోజు వాక్యధ్యానం చదువు!


No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.