చెడ్డవారు యుద్ధాన్ని గెలిచినప్పుడు

కొన్నిసార్లు చెడ్డవారు గెలిచినట్టు అనిపించవచ్చు గాని అంతిమంగా గెలిచేది ఎవరో తెలుసుకుంటే అవి అంతగా బాధపెట్టవు. దీనినే ఈరోజు వాక్యధ్యానంలో తెలుసుకుందాం.


నేను కీడుకి మేలు చేస్తే, ఆ వ్యక్తి మాత్రం నేను చేసిన మేలుకి కీడు చేసాడు.


తన పాపాన్ని గ్రహించకుండా ఉన్న ఆ పాశ్చాతాపపడని వ్యక్తి గురించి నేను నా భర్త దగ్గర ఫిర్యాదు చేసాను. చెడే మంచి మీద విజయాన్ని సాధించిందేమో, అతనే గెలిచాడేమో అనిపించింది.


"చూడటానికి మాత్రమే అతను యుద్ధాన్ని గెలిచాడు" అనిపిస్తుంది గాని, నిజానికి అతనే ఓడిపోయాడు అని నా భర్త చెప్పారు. చూడటానికి మాత్రమే నువ్వు ఓడిపోయినట్టుగా కనిపించింది గాని, నీ మనస్సాక్షి స్వచ్ఛమైనదిగా ఉంది కాబట్టి నిజానికి నువ్వే ఈ యుద్ధంలో గెలిచావని చెప్పారు.


నా భర్త చెప్పింది నిజం.


ఈ లోకంలో మనకు శ్రమే, కొన్నిసార్లు చూడటానికి చెడ్డవారే గెలిచినట్టుగా కనిపిస్తుంది (యోహాను 16:33).


కాని దేవునికి సమస్తము తెలుసు (లూకా 12:2). ఇతరులు అలాంటి చెడ్డవారిని గుర్తించలేక మోసపోవచ్చేమో గాని, దేవుణ్ణి మాత్రం ఎవ్వరు మోసం చేయలేరు (2 కొరింధీయులకు 10:18).


కాబట్టి మేలు చేయుట యందు మనము విసుకక ఉందాం ఎందుకంటే తగిన కాలమందు పంట కోస్తాం గనుక (గలతీ 6:9).


చెడ్డవారు ఇక్కడ ఎన్ని యుద్ధాలు గెలిచినా, అంతిమ విజయం నిజమైన క్రీస్తు అనుచరులదే (ఎఫెస్సీ 6:12; ప్రకటన 17:14).


• విజయం అనేది ఈ భూమిపై ఉన్న మనుష్యులది, పరిస్థితులది కాదు గాని అన్నీ తెలిసిన యేసు ప్రభువుని వెంబడించిన వారిదే అని తెలుసుకోవడం నీకు సంతోషాన్నిస్తుందా?


When the Bad Guys Win the Battle



No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.