1800 సంవత్సరంలో అనాధలైన ఇంగ్లీష్ పిల్లలను వ్యాధి సోకిన ఇళ్లల్లో ఉంచి, బలవంతంగా చాలా గంటలు పనిచేయించుకోవడం, చాలా అరుదుగా ఆహరం పెట్టడం, వారితో కఠినంగా వ్యవహరించడం చేసేవారు. (1)
జార్జ్ ముల్లర్ (1805-1898) తనకు కలిగి ఉన్న సమస్తాన్ని వదులుకొని, ఈ అనాధల కోసం జీతం కూడా లేకుండా పనిచేసేవాడు.
ఎక్కడా డబ్బులు అడక్కుండా మూడు అనాధ శరణాలయాల కోసం ఎంతో ప్రార్ధించేవాడు. తాను చూసుకోవడానికి వీలుకాని ఆనాధల గురించి తన గుండె పగిలిపోయేది.
తన ప్రార్ధన అంశాలలో చాలా అసాధ్యం అనిపించే ఒక అంశం ఉంది. అదేమిటంటే 700 అనాధలకు సరిపోయే అంత అనాధ శరణాలయం కావాలని ప్రార్ధించేవాడు. (2)
అవి కఠినమైన సమయాలు, అందరు అతన్ని పిచ్చివాడు అనుకునే వాళ్ళు. అప్పుడే ముల్లర్ తన పుస్తకంలో ఈ మాటలు వ్రాసుకున్నాడు : "నేను చెల్లించవలసినది గొప్ప మూల్యం అయినా అది నాకు ఒక విధమైన రహస్య ఆనందాన్ని ఇస్తుంది. ఎందుకంటే అధిగమించాల్సినది ఎంత కఠినమైనదైతే అంత ఎక్కువగా ప్రార్ధన, విశ్వాసం ద్వారా అది దేవునికి మహిమను తీసుకువస్తుంది" అని.
తన మరణం కంటే ముందే తన ప్రార్ధించిన దానికంటే ఎన్నోరెట్లు జవాబు పొందాడు. ఒక్క రూపాయి కూడా ఎవ్వరినీ అడగకుండానే 10,000 కంటే ఎక్కువ మంది అనాధలకు బట్టలు, ఉండటానికి ఇల్లు, మంచి విద్య అందించగలిగాడు.
తన ధనంతో సహా, తనను తాను ఇతరుల సేవకు ఇచ్చివేసుకున్న ముల్లర్ కు ఉన్నటువంటి అదే సమ్మతిగల మనసులో కొంచెం శాతం మనకు కూడా ఉంటే ఎలా ఉంటుందో ఊహించండి.
ముల్లర్ జీవిత చరిత్ర నాకు ఎంతో స్ఫూర్తిని ఇవ్వడం మాత్రమే కాదు, నాలో ఉన్న అల్పమైన పిసినారివంటి విశ్వాసాన్ని గుర్తుచేసి నన్ను సవాలు చేసింది.
జార్జ్ ముల్లర్ లాగే నేను కూడా నా ప్రభువును అదే విధేయతతో, అనురాగంతో ప్రేమింతును గాక!
---------------
(1) జార్జ్ ముల్లర్ సమకాలికుడైన చార్లెస్ డిక్కెన్స్, ఒలివర్ ట్విస్ట్ అనే నవల వ్రాసాడు. ఆ సమయంలో ఉన్న వీధి బాలలు వారి జీవితాలు, వారి భయంకరమైన పేదరికం, అనాధ శరణాలయాలలో వారి క్రూరమైన అనుభవాలు గురించి ఆ నవలలో వ్రాసాడు.
(2) (ఎఫెస్సీ 3:20, 21) "మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనము అడుగువాటన్నిటికంటెను, ఊహించువాటన్నిటికంటెను అత్యధికముగా చేయ శక్తిగల దేవునికి, క్రీస్తుయేసు మూలముగా సంఘములో తరతరములు సదాకాలము మహిమ కలుగునుగాక. ఆమేన్.
No comments:
Post a Comment
Note: Only a member of this blog may post a comment.