సంతృప్తి సరైన దృక్పధం వలనే వస్తుంది

బహుశా ఆ 25 శాతంలో నువ్వు ఉన్నావేమో. దీని అర్ధం ఏమిటి? తృప్తిని కలిగి ఉండటానికి కావాల్సిన జ్ఞాన సంపదను ఈరోజు వాక్యధ్యానం అందిస్తుంది!


మనకంటే ధనవంతులు, పలుకుబడి ఉన్నవారు మన చుట్టూ ఉన్నపుడు అది ఒక సవాలుగా ఉంటుంది. ఎందుకంటే సాధారణంగా మానవ స్వభావం అలాంటి వారితో పోల్చుకోని, అసంతృప్తికి గురికావడం.


ఎప్పుడూ మనకు లేనివి కాని కావాలి అనిపించే ఎవో ఒకటి ఉంటూనే ఉంటాయి. మనం ఇంకా చూడని ప్రదేశమో, మనకు అవసరం లేని కాని కావాలి అనిపించే ఇంకా అనుభవించని సుఖమో లేక సౌకర్యమో ఇలా ఎదో ఒకటి ఉంటూనే ఉంటుంది.


అందుకే మన జీవితాన్ని ఈ లోకంలో ఉన్న ఇతర పరిస్థితులతో ఒక్కసారి పోల్చి సరైన దృక్పధంలో చూడటం చాలా ప్రాముఖ్యం.


నీకు తెలుసా :


"నీ ఫ్రిడ్జ్ లో తినడానికి ఆహరం, నీ షెల్ఫ్ లో వేసుకోవడానికి బట్టలు, తలదాసుకోవడానికి నీడ, పడుకోవడానికి స్థలం ఉంటే, నువ్వు ఈ లోకంలో 75 శాతం మంది కంటే సుఖమైన జీవితం గడుపుతున్నావని అర్ధం"


ఈ పై విధంగా మన జీవితాన్ని లోకంతో పోల్చి సరైన దృక్పధంలో చూసిన తరువాత, సువార్త దృక్పధంలో కూడా మన జీవితాలను చూసుకోవడం అత్యంత ప్రాముఖ్యం ఎందుకంటే "సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభసాధనమైయున్నది". (1 తిమోతికి 6:6)


ఆత్మసంబంధమైన ధనాన్ని సంపాదించడానికి మన హృదయాలకు అవకాశం ఇద్దామా?


Contentment Comes from Proper Perspective



No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.