నువ్వు కఠినమైన అర్ధంకాని పరిస్థితులలో ఉండి, బాధతో దేవుణ్ణి ప్రశ్నిస్తున్న సమయంలో, ఎవరైనా దేవుని గురించి నిన్ను అడిగినప్పుడు, వెంటనే ఆయన అద్భుతమైన విశ్వాస్యతను వారికి వివరించడం ఎపుడైనా జరిగిందా?
నేను కొన్నిసార్లు ఇలా చేసి, నేను ఇప్పుడు దేవుని విశ్వాస్యతను, శక్తిని అనుభవించలేకపోతున్నాను కదా, నేనే అయోమయంతో, బలహీనంగా ఉండి.. ఇలా ఎలా వారికి చెప్తున్నాను, "ఏంటి నేను ఏమైనా మోసం చేస్తున్నానా?" అని ఆలోచించాను.
అయితే అసలు ఏమి జరుగుతుంది?
ఆత్మ, నన్ను నియంత్రిస్తుందని అర్ధం. నా ఆత్మ (నాలో ఉన్న దేవుని ఆత్మ) ఎంతో నమ్మకంతో, నిరీక్షణతో ఉండి, నా మనస్సు అనుమానంతో పోరాడుతున్నా, నాకు, అలానే ఇతరులకు నిరీక్షణనిస్తుంది (రోమా 8:16,17).
• మనము చూడనిదాని కొరకు నిరీక్షించిన యెడల ఓపికతో దానికొరకు కనిపెట్టుదుము. అటువలె ఆత్మయు మన బలహీనతను చూచి సహాయము చేయుచున్నాడు. ఏలయనగా మనము యుక్తముగా ఏలాగు ప్రార్థన చేయవలెనో మనకు తెలియదు గాని, ఉచ్చరింపశక్యముకాని మూలుగులతొ మరియు హృదయములను పరిశోధించువాడు ఆత్మయొక్క మనస్సు ఏదో యెరుగును; ఏలయనగా ఆయన దేవుని చిత్తప్రకారము పరిశుద్దులకొరకు విజ్ఞాపనము చేయుచున్నాడు. (రోమీయులకు 8:25-27)
--------------------
(1) పరిశుద్ధ గ్రంధంలో ఉన్న కొన్ని ఉదాహరణలు : యిర్మీయా అయోమయంలో, నిరాశలో, ఓడిపోయిన పరిస్థితులలో ఉన్నప్పుడు కూడా దేవుని విశ్వాస్యతను ఎంతో సాహసంతో ప్రకటించాడు (యిర్మీయా 12:1-4; యిర్మీయా 20:7-18). 10 వ కీర్తనలో, కీర్తనాకారుడు ఈ కీర్తనను దేవుడు తనను వదిలేసాడేమో అనే వేదనతో మొదలుపెట్టి, దేవుని విశ్వాస్యతను కొనియాడటంతో ముగించాడు.
When We're Confused, Our Spirit Knows
No comments:
Post a Comment
Note: Only a member of this blog may post a comment.