పాత నిబంధనలో ఉన్న చెడు వ్యక్తులు కొత్త నిబంధనలో హెచ్చరికకు ఉపయోగపడే ఉదాహరణలు.
ఉదాహరణకు : బిలాము (సంఖ్యకాండము 22-24)
గొప్ప మలుపులతో, మాట్లాడే గాడిదతో ఉన్న ఆసక్తికరమైన కధలో, ఇశ్రాయేలీయులను శపిస్తే మోయాబు రాజు దగ్గర ఎంతో ధనం సంపాదించొచ్చు అని బిలాము ఆశపడ్డాడు.
నిజంగా బిలాము యదార్థమైన దేవుని అనుచరుడా కాదా అనేది అస్పష్టం కాని దేవుడు అతనితో మాట్లాడాడు అనేది మాత్రం మనకు తెలుసు. అందుకే దేవుని ప్రజలైన ఇశ్రాయేలీయులను శపించకుండా ఆగిపోయాడు.
కాని అతని ఉద్దేశాలు మాత్రం లోకానుశారమైనవి అందుకే దేవుని ప్రజలను విగ్రహారాధన, లైంగిక పాపాలతో తప్పుత్రోవలోకి నడిపించే పన్నాగంలో తాను పాత్ర పోషించాడు. (ప్రకటన 2:14).
బిలాము "దుర్నీతి వలన కలిగే బహుమానమును ప్రేమించాడు" (2 పేతురు 2:15,16), లాభం కోసం ప్రజలను మోసం చేసాడు (యూదా 1:11).
బిలాము లాంటి వారే సంఘాల్లోకి రహస్యంగా చొరబడతారని పేతురు, యూదా మనలను హెచ్చరిస్తున్నారు.
ఎపుడైనా వాక్యాన్నే వారు మాట్లాడినా సరే, బిలాములాగా వారి విలువలు మాత్రం లోక సంబంధంగా ఉంటాయి. చివరకు విగ్రహారాధన, ధనం, పేరు ప్రతిష్టలు, అనైతికతలను వారు ప్రచారం చేస్తారు.
కనుక వాక్యంలో ఉన్న హెచ్చరికలను హృదయంలో ఉంచుకొని, బోధలలో ఉన్న తప్పులను, సత్యాలను గుర్తించి, ప్రతీది వాక్యంతో పరీక్షించాలి.
No comments:
Post a Comment
Note: Only a member of this blog may post a comment.