క్రైస్తవ విశ్వాసంలో అతి ముఖ్యమైన సిద్ధాంతం ఏమిటంటే, పరిశుద్ధ గ్రంధం పొరపాటులేని దేవుని వాక్యం అనే నమ్మకం.
హెబ్రీ 4:12; 2 తిమోతి 3:16-17 చూడండి.
దీని అర్ధం ఏమిటి :
1. పరిశుద్ధ గ్రంధం పూర్ణంగీకారయోగ్యమైనది, కచ్చితమైనది, సత్యమైనది.
2. మానవులచే రచింపబడినా, ఆ మాటలు దేవుని ఆత్మ ద్వారా వచ్చినవే. మానవుల పక్షపాతానికి గాని, తప్పులకు గాని గురై చెడిపోయినది కాదు. (1)
దాని అర్ధం పుస్తకంలో ఉన్న ఆ భాగాన్ని అక్షరాలా తీసుకోవాలని కాదు. పరిశుద్ధ గ్రంధంలో ఉపమానాలు ఉంటాయి, వాటిని అక్షరార్ధ భావం తీసుకోకూడదు. (2)
అన్ని సంస్కృతులకు పరిశుద్ధ గ్రంధంలో ఉన్న నియమాలు వర్తిస్తాయని కాదు. నియమాలు సర్వత్రికమైనవే కాని ఒకొక్క సంస్కృతికి తగ్గట్టుగా వర్తిస్తాయి. (ఉదా : నిరాడంబరత)
అన్ని భాషాంతరాలు లోపం లేనివి కాదని కాదు గాని కొన్ని భాషాంతరాలలో ఇతర భాషాంతరాలకంటే కచ్చితత్వం ఎక్కువ ఉందని అర్ధం. (3)
వాటి వెనుక ఉన్న సంసృతి మరియు చరిత్ర పరిశీలన చేయకూడదని కాదు. పాత నిబంధనలో ఉన్న కొన్ని ఆజ్ఞలు పరిస్థితులు అప్పటి చరిత్ర సంస్కృతులను పరిశీలిస్తేనే అర్ధం చేసుకోగలం. కాని చరిత్ర మరియు సంస్కృతి కొత్త నిబంధనలో ఉన్న ఆజ్ఞలను నియమాలను తిరస్కరించడం లేదని అర్ధం.
పరిశుద్ధ గ్రంధంలో ఉన్న ప్రతీ లేఖన భాగం మనకు అర్ధంకాకపోవచ్చు, కాని ప్రతీ లేఖన భాగం "దైవావేశం" వలన కలిగినదే. అంటే అది 100% ఖచ్చితమైనదని ఒక కవి భాషలో చెప్పడమనమాట!
-----------------------
(1) ఒకడు తన ఊహనుబట్టి చెప్పుటవలన లేఖనములో ఏ ప్రవచనమును పుట్టదని మొదట గ్రహించుకొనవలెను. ఏలయనగా ప్రవచనము ఎప్పుడును మనుష్యుని ఇచ్ఛనుబట్టి కలుగలేదు గాని మనుష్యులు పరిశుద్ధాత్మవలన ప్రేరేపింపబడినవారై దేవుని మూలముగ పలికిరి. (2 పేతురు 1:20,21)
• ఇది పాత నిబంధనకు కూడా వర్తిస్తుంది.
ఏలయనగా ఓర్పువలనను, లేఖనములవలని ఆదరణవలనను మనకు నిరీక్షణ కలుగుటకై పూర్వమందు వ్రాయబడినవన్నియు మనకు బోధ కలుగు నిమిత్తము వ్రాయబడియున్నవి. (రోమీయులకు 15:4)
పేతురు తన పత్రికలో, పౌలు వ్రాసిన పత్రికలు దేవుని లేఖనాలని చెప్పడం గమనించాలి :
ప్రియులారా, వీటికొరకు మీరు కనిపెట్టువారు గనుక శాంతముగలవారై, ఆయన దృష్టికి నిష్కళంకులుగాను నిందారహితులుగాను కనబడునట్లు జాగ్రత్తపడుడి. మరియు మన ప్రభువు యొక్క దీర్ఘశాంతము రక్షణార్థమైనదని యెంచుకొనుడి. ఆలాగు మన ప్రియ సహోదరుడైన పౌలు కూడ తనకు అనుగ్రహింపబడిన జ్ఞానముచొప్పున మీకు వ్రాసియున్నాడు. (2 పేతురు 3:14,15)
(2) దేవుని వాక్యం పొరపాటు లేనిదని నమ్మడం అంటే భూమి చదునైనది, చెట్లు చప్పట్లు కొట్టడం అనేవి ఉన్నది ఉన్నట్టుగా నమ్మడం కాదు!
(3) ఇంగ్లీష్లో ఉన్న కొన్ని భాషంతరాలే దేవుడు అనుమతించినవి అని వాదించే వారి వాదనలలో చిక్కుకోకండి.
(4) దేవదూతలకు బదులు
కన్యలైన కూతుర్లు దుర్వినియోగం చేయబడటానికి లోతు అర్పించినపుడు దేవుడు ఎందుకు అనుమతించాడు అని (ఆదికాండము 19:8) ఈ మధ్య నన్ను ఒకరు అడిగారు. దేవుడు అనుమతించలేదు. లేఖనాలలో అది ఉన్నంతమాత్రానా, దేవుడు దానిని అనుమతించాడని కాదు. ఆ సందర్భంలో, ఇతర సందర్భాలలో కూడా లోతు చాలా చెడుని చేసాడు. ఒకవేళ మనిషి తయారు చేసిన మతమైతే, తప్పులను కప్పిపుచ్చి, ఆ వ్యక్తులను ఏ లోపం లేనివారుగా చూపిస్తారేమో. కాని మన నిజ దేవుడు ఉన్నది ఉన్నట్లుగా తన బిడ్డల చరిత్రను వ్రాయించాడు. అబ్రాహాము, దావీదు ఇంకా ఇలా అనేకుల చరిత్రను వారు చేసిన తప్పులతో సహా నిజాయితీగా మన ముందు పెట్టాడు.
Believing God's Word Is Inerrant
No comments:
Post a Comment
Note: Only a member of this blog may post a comment.