ఆయన ప్రేమకు హద్దులు లేవు

చాలా ప్రాముఖ్యమైనది ఒకటి నిజమైన విశ్వాసులు చేయాడనికి స్ఫూర్తినిచ్చే సందేశం, ఈరోజు తేటగా హోషేయా గ్రంధంలో నుండి చూద్దాం!


మనుషులతో ఆయనకున్న బంధాన్ని మనకు అర్ధమయ్యేలాగా చెప్పడానికి, వివాహాన్ని ఒక అలంకారంగా హోషేయ గ్రంధంలో దేవుడు ఉపయోగించాడు (హోషేయ 1:2,3). (1)


దేవుని బిడ్డలు ఇతర దేవుళ్ళ వైపు పరుగులు పెట్టినప్పుడు దేవునికి ఎలా ఉంటుందో అనేదాన్ని, హోషేయ తన భార్య గోమెరు ఒక వేశ్యగా మారినప్పుడు ప్ర త్యక్షంగా వ్యక్తిగతంగా నేర్చుకున్నాడు. (2)


నమ్మకద్రోహం చేసేవారిని దేవుడు శిక్షిస్తాడు కాని అందులో కూడా వారిని తిరిగి సంపాదించడమే మొట్ట మొదట ఆయనకున్న కోరిక (హోషేయ 2:13-15).


నమ్మకద్రోహం చేసిన గోమెరును, హోషేయ తన దగ్గరకు తిరిగి రమ్మని అడగడం, దేవుడు మనలను కూడా పిలుస్తున్నాడనే ఆ సత్యాన్ని వివరిస్తుంది (హోషేయ 3:1).


క్రీస్తు యొక్క విమోచనకు ముందస్తు గుర్తుగా హోషేయను చూడగలం : మనం కూడా అలాంటి నమ్మకద్రోహం చేసిన "వేశ్యలుగా" ఉన్నాం, యేసు ప్రభువు మనలను క్షమించే భర్తగా ఉన్నారు (రోమా 3:23, ఎఫెస్సీ 5:23).


మనం గనుక నిజంగా పశ్చాతాపపడితే, ఎప్పటికీ ఆర్పలేని దేవుని వాగ్దానాన్ని బట్టి ఆనందించగలం. ఆ వాగ్దానం ఏమిటంటే : వారిమీదనున్న నా కోపము చల్లారెను, మనస్ఫూర్తిగా వారిని స్నేహింతును.  (హొషేయ 14:1-4)


మనం గనుక హోషేయ గ్రంధాన్ని చదివి, పర్వాలేదులే మనం ఏం చేసినా దేవుడు క్షమించేస్తాడు అని అనుకుంటే, అంతకంటే అత్యంత బాధాకరమైన విషయం ఇంకోటి ఉండదు (3)


❤ నిజానికి, హోషేయ కధ, "హద్దులు లేని" ప్రేమ కలిగిన దేవుని సంతోషపెట్టాలనే లోతైన వాంఛను  మనలో పుట్టించాలి.


------


(1) దేవుడు ఈ అలంకారాన్ని లేఖనాలలో ఇతర చోట్ల వాడినా, హోషేయ గ్రంధంలో వాడినంత తేటగా మరి ఎక్కడా వాడలేదు. (ఉదా: యెషయా 54:5)


(2) లేఖనంలో ఇది తేటగా ఇవ్వబడలేదు. బైబిల్ పండితులు అతను గోమెరును వివాహం చేసుకునే సమయానికే ఆమె ఒక వేశ్య లేక అటువంటి గుణం కలిగినది అని నమ్ముతారు. ఇంకొందరు ఆమె గుణం మంచిది కాదు కాని పిల్లలు పుట్టిన తరువాతే వేశ్యగా మారిందని నమ్ముతారు.


(3) దేవుని క్షమించే ప్రేమను మాత్రమే కాదు, పశ్చాతాపానికి స్పష్టమైన పిలుపును కూడా హోషేయ గ్రంధంలో చూడగలం (హోషేయ 14:2, హోషేయ 6:1-3).


(4) విశ్వాసులు, దేవుని సంతోషపెట్టేది ఏమిటో తెలుసుకోవాలని ఆజ్ఞాపించబడ్డారు (ఎఫెస్సీ 5:10), దేవుని అద్భుతమైన ప్రేమను మనం ఎప్పటికీ పూర్తిగా తెలుసుకోలేమని వాక్యం చెబుతుంది (ఎఫెస్సీ 3:17-19).


His Love Knows No Bounds


చాలా ప్రాముఖ్యమైనది ఒకటి నిజమైన విశ్వాసులు చేయాడనికి స్ఫూర్తినిచ్చే సందేశం, ఈరోజు తేటగా హోషేయా గ్రంధంలో నుండి చూద్దాం!


No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.