ఒకసారి ఊహించుకో... నీ జీవితకాలమంతా నెలకు కొన్ని కోట్ల రూపాయలు ఒకరు నీకు ఇస్తూ ఉన్నారనుకో, నీ గ్యాస్ ధర పెరిగితే, ఇంకా ధనం కావాలని ఫిర్యాదు చేస్తావా? నీకు ఉపకారం చేసిన వ్యక్తే నీ సరుకులను కూడా కొనాలని ఆశిస్తావా?
కొన్నిసార్లు దేవుడు నా పరిస్థితులను మార్చొచ్చు - ఆరోగ్య సమస్య, ప్రేమించిన వారు తప్పు నిర్ణయాలు చేయడం, ఒత్తిడికి గురిచేసే పరిస్థితులు మొదలైనవి. కాని వీటన్నింటిల్లో కూడా సరైన దృక్పధం నేను కలిగి ఉండటం నాకు చాలా అవసరం.
ఆయన నా పాపాలను క్షమించాడు, ఇది నేనెప్పటికీ తీర్చలేని ఋణం. నేను కష్టాలలో నడిచినప్పుడు, నాకు బలాన్ని, ఆదరణను, ప్రోత్సాహాన్ని ఇస్తానని వాగ్దానం చేసాడు. అంతే కాదు, నాకు శాశ్వతమైన సంతోషాన్ని, సమాధానాన్ని ఇస్తానని కూడా వాగ్దానం చేసాడు.
• ఏలయనగా పాపమువలన వచ్చు జీతము మరణము, అయితే దేవుని కృపావరము మన ప్రభువైన క్రీస్తుయేసునందు నిత్య జీవము. (రోమీయులకు 6:23)
• కనికరము చూపు తండ్రి, సమస్తమైన ఆదరణను అనుగ్రహించు దేవుడు, మన ప్రభువైన యేసుక్రీస్తు తండ్రియునైన దేవుడు స్తుతింపబడునుగాక. దేవుడు మమ్మును ఏ ఆదరణతో ఆదరించుచున్నాడో, ఆ ఆదరణతో ఎట్టి శ్రమలలో ఉన్నవారినైనను ఆదరించుటకు శక్తిగలవారమగునట్లు, ఆయన మాశ్రమ అంతటిలో మమ్మును ఆదరించుచున్నాడు. (2 కొరింథీయులకు 1:3-4)
• మనము దేవుని పిల్లలమని పిలువబడునట్లు తండ్రి మనకెట్టి ప్రేమననుగ్రహించెనొ చూడుడి; మనము దేవుని పిల్లలమే.ఈ హేతువు చేత లోకము మనలను ఎరుగదు, ఏలయనగా అది ఆయనను ఎరుగలేదు. (1 యోహాను 3:1)
• దేవుని గూర్చినట్టియు మన ప్రభువైన యేసును గూర్చినట్టియునైన అనుభవజ్ఞానము వలన మీకు కృపయు సమాధానమును విస్తరించును గాక. (2 పేతురు 1:3)
నాకెన్ని సమస్యలు ఉన్నా సరే, అనుదినము నా కృతజ్ఞతలు, నిరంతరం నా స్తుతి అర్పణలు ఆ దేవాది దేవుడు పొందటానికి ఎంతైనా అర్హుడు. (1 థెస్సలోనిక 5:16-18). ఇది నాకు మాత్రమే కాదు, ప్రతీ విశ్వాసికీ నిజంగా వర్తించేదే.
Forever Debtors: Are You Grateful to Your Benefactor?
No comments:
Post a Comment
Note: Only a member of this blog may post a comment.