ఏనుగులు, పగ పెట్టుకోవడం : వాస్తవాలు

 

పగ పెట్టుకోవడం అనే గుణం ఆసక్తికరంగా  ఏనుగులలో చూస్తాం. ఈ చెడు గుణం గురించి మనుష్యులంగా మనం ఏమి నేర్చుకోగలమో ఈరోజు వాక్యధ్యానంలో చూద్దాం!

"ఏనుగులు ఎప్పటికీ మర్చిపోవు"


ఏనుగులకు - ముఖాలను, వాసనలను, పరిస్థితులను ముఖ్యంగా దురాచారానికి గురైనప్పటి జ్ఞాపకాలను అసాధారణ రీతిలో గుర్తుంచునే సామర్ధ్యం ఉన్నట్టు సైంటిఫిక్ అమెరికన్ ఎలిఫెంట్ వారు వారి పరిశోధనలో తెలిపారు. పగ పెట్టుకోవడం వలనే అవి బ్రతికి ఉండగలుగుతాయని వారు చెప్తారు.


సహోదరులారా, నేనిదివరకే పట్టుకొనియున్నానని తలంచుకొనను. అయితే ఒకటి చేయుచున్నాను; వెనుక ఉన్నవి మరచి ముందున్న వాటికొరకై వేగిరపడుచు క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానమును పొందవలెనని, గురి యొద్దకే పరుగెత్తుచున్నాను. (ఫిలిప్పీయులకు 3:13-14)


ఈ జీవితంలో దేవుడిచ్చిన గురికై ముందుకు సాగాలంటే "మర్చిపోవడం" అనే గుణం చాలా ప్రాముఖ్యమైనది.


పౌలుకు కూడా మర్చిపోవాల్సిన కొన్ని సంగతులు ఉన్నాయి :
1. 
స్తెఫను హత్యకు తాను సమ్మతి తెలపడం (అపో. కార్యములు 7:54-8:3).
2. అన్యాయంగా దెబ్బలు తినడం, చెరశాలలో ఉండటం (2 కొరింధీ 11:23-33).


దేవుని ప్రణాళికలు నెరవేర్చడానికి, ఇవన్నీ తను మర్చిపోవాలి, ముందుకే సాగిపోవాలి.


గడిచిపోయిన వాటికొస్తే నేను కూడా కొన్నిసార్లు ఒక "ఏనుగునే" అని ఒప్పుకోక తప్పదు. కాని నాకు జరిగిన అన్యాయాలు, విచారాలు దేవుని చేతికి అప్పచెప్పడం నేర్చుకుంటున్నాను. మరి నీ సంగతి ఏమిటి?


గడిచిపోయిన విషయాలు ఏమైనా నీ హృదయంలో చిక్కుకుపోయి ఉన్నాయా? అవేమిటో ఈరోజు దేవుని చేతులకు అప్పగించి, నీ భవిష్యత్తును నూతన నిరీక్షణతో ఎదుర్కుంటావా?


Facts: Elephants & Grudge-holding


పగ పెట్టుకోవడం అనే గుణం ఆసక్తికరంగా  ఏనుగులలో చూస్తాం. ఈ చెడు గుణం గురించి మనుష్యులంగా మనం ఏమి నేర్చుకోగలమో ఈరోజు వాక్యధ్యానంలో చూద్దాం!


No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.