సత్యం : ఇది మనకు అవసరం

పరిశుద్ధ గ్రంధంలోని సత్యం మన విశ్వాసానికి అత్యంత ప్రాముఖ్యం అయినప్పటికీ అది నిరంతరం దాడికి గురవుతుంది. ఈరోజు వాక్యధ్యానం 20 వచనాలు మనకు అందిస్తుంది.


వాక్యభాగాల పూర్తి వచనాలు ఈ వాక్యధ్యానం క్రింద చూడండి.


1. ఇదివరుకటికంటే ఎక్కువగా ఇప్పుడు దేవుని సత్యం దాడికి గురవుతుంది.

అపవాది, అబద్దమునకు జనకుడు.. దేవుని సత్యాన్ని తిరస్కరిస్తాడు, వక్రీకరిస్తాడు, అపకీర్తి తెస్తాడు. (యోహాను 8:44-45).

అబద్ద బోధకులు వక్రీకరిస్తారు (అపో. కార్యములు 20:29-31).

అవిశ్వాసులు సత్యాన్ని అడ్డగిస్తారు, నిరాకరిస్తారు (రోమీయులకు 1:18-19, థెస్సలొనిక 2:10-12; రోమీయులకు 1:25).

కొంతమంది క్రైస్తవులమని చెప్పుకుంటారు, కాని వారి హృదయాల్లో సత్యం లేదు గనుక వారు నకిలీలు (1 యోహాను 2:4; 1 యోహాను 1:8).

2. సత్యం మన విశ్వాసానికి అత్యంత ప్రాముఖ్యం.

రక్షణ అంటే దేవుని సత్యాన్ని స్వీకరించడం, నమ్మడం (ఎఫెసీ 1:3; 1 తిమోతి 2:3-4).

క్రీస్తు శరీరం సత్యమునకు స్థంభమును ఆధారామునైయున్నది (1 తిమోతి 3:15).

సత్యం మనలను దైవభక్తిలోనికి నడిపిస్తుంది (కీర్తనలు 25:5; తీతుకు 1:1).

ఆత్మతో సత్యముతో మనం ఆరాధించాలి (యోహాను 4:22-24).

సత్యం మనలను స్వతంత్రులుగా చేస్తుంది కాబట్టి ప్రభువుతో దగ్గరగా నడవగలం (యోహాను 8:31-32).

3. యదార్థమైన విశ్వాసులు దేవుని సత్యానికి ఎంతో విలువనిస్తారు.

మనం సత్యాన్ని "కొనుక్కుంటాం": వెంటాడాలి, ప్రాధాన్యతనివ్వాలి, ఆధారంగా చేసుకోవాలి (సామెతలు 23:23; 2 కొరింధీ 13:8).

మనం సత్యాన్ని వక్రీకరించం కాని ఉన్నది ఉన్నట్టుగా చెప్తాం (2 కొరింధీ 4:2).

ప్రేమతో 🩵 సత్యాన్ని పలుకుతాం (ఎఫెస్సీ 4:15).

దేవుని సత్యపు వెలుగులో మనం నివసిస్తాం, దానికి విధేయత చూపుతాం (ఎఫెస్సీ 5:8-9; 1 పేతురు 1:22).

వాక్యపు సత్యాన్ని సరిగా ఉపదేశిస్తాము (2 తిమోతి 2:15).

కనుక ప్రియ క్రైస్తవ విశ్వాసి, " మీ నడుమునకు సత్యమను దట్టి కట్టుకొని" (ఎఫెసీ 6:14) స్థిరముగా నిలబడు.

🩵 ఒక్క-నిమిషం వాక్యధ్యానానికి మించి ఇంకా కావాలి అనుకునే వారి కోసం :

వాక్యధ్యానంలో ఉన్న వాక్యాలు చదివి, దేవుని సత్యంలో నీ పునాదిని బలపరచమని ఈ వారమంతా దేవుని ఎందుకు అడగకూడదు?

ఈ కాలంలో క్రైస్తవులు ఎక్కువ గట్టి పోరాటాన్ని ఎదురుకుంటున్నారు కాబట్టి లేఖనాల్లో ఉన్న దేవుని సత్యాన్ని తెలుసుకోని దాన్ని గట్టిగా పట్టుకోవడం చాలా ప్రాముఖ్యం.

1. ఇదివరుకటికంటే ఎక్కువగా ఇప్పుడు దేవుని సత్యం దాడికి గురవుతుంది.

• మీరు మీ తండ్రియగు అపవాది సంబంధులు; మీ తండ్రి దురాశలు నెరవేర్చగోరుచున్నారు. ఆదినుండి వాడు నరహంతకుడైయుండి సత్యమందు నిలిచినవాడుకాడు; వానియందు సత్యమేలేదు; వాడు అబద్ధమాడునప్పుడు తన స్వభావము అనుసరించియే మాటలాడును; వాడు అబద్ధికుడును అబద్ధమునకు జనకుడునైయున్నాడు. నేను సత్యమునే చెప్పుచున్నాను గనుక మీరు నన్ను నమ్మరు. (యోహాను 8:44, 45)

• నేను వెళ్లిపోయిన తరువాత క్రూరమైన తోడేళ్లు మీలో ప్రవేశించునని నాకు తెలియును; వారు మందను కనికరింపరు. మరియు శిష్యులను తమవెంట ఈడ్చుకొనిపోవలెనని వంకర మాటలు పలుకు మనుష్యులు మీలోనే బయలుదేరుదురు. కావున నేను మూడు సంవత్సరములు రాత్రింబగళ్లు కన్నీళ్లు విడుచుచు ప్రతి మనుష్యునికి మానక బుద్ధి చెప్పితినని మీరు జ్ఞాపకము చేసికొని మెలకువగా ఉండుడి. (అపొ. కార్యములు 20:29-31)

• దుర్నీతిచేత సత్యమును అడ్డగించు మనుష్యులయొక్క సమస్త భక్తిహీనతమీదను, దర్నీతిమీదను దేవుని కోపము పరలోకమునుండి బయలుపరచబడుచున్నది. ఎందుకనగా దేవునిగూర్చి తెలియశక్యమైనదేదో అది వారి మధ్య విశదమైయున్నది; దేవుడు అది వారికి విశదపరచెను. (రోమా 1:18-19)

• దుర్నీతిని పుట్టించు సమస్త మోసముతోను, నశించుచున్న వారిలో సాతాను కనుపరచు బలమును అనుసరించియుండును ఇందుచేత సత్యమును నమ్మక దుర్నీతియందు అభిలాషగలవారందరును శిక్షావిధి పొందుటకై, అబద్ధమును నమ్మునట్లు మోసముచేయు శక్తిని దేవుడు వారికి పంపుచున్నాడు. (2 థెస్సలొనీక 2:10-12)

• అట్టివారు దేవుని సత్యమును అసత్యమునకు మార్చి, సృష్టికర్తకు ప్రతిగా సృష్టమును పూజించి సేవించిరి. యుగముల వరకు ఆయన స్తోత్రార్హుడైయున్నాడు, ఆమేన్‌. (రోమా 1:25)

• ఆయనను ఎరిగియున్నానని చెప్పుకొనుచు, ఆయన ఆజ్ఞలను గైకొననివాడు అబద్ధికుడు; వానిలో సత్యములేదు. (1 యోహాను 2:4)

• మనము పాపములేనివారమని చెప్పుకొనిన యెడల, మనలను మనమే మోసపుచ్చుకొందుము; మరియు మనలో సత్యముండదు. (1 యోహాను 1:8)

2. సత్యం మన విశ్వాసానికి అత్యంత ప్రాముఖ్యం.

• మీరును సత్యవాక్యమును, అనగా మీ రక్షణ సువార్తను విని, క్రీస్తునందు విశ్వాసముంచి, వాగ్దానము చేయబడిన ఆత్మచేత ముద్రింపబడితిరి. (ఎఫెసీ 1:13)

• ఇది మంచిదియు మన రక్షకుడగు దేవుని దృష్టికి అనుకూలమైనదియునై యున్నది. ఆయన, మనుష్యులందరు రక్షణపొంది సత్యమును గూర్చిన అనుభవజ్ఞానముగలవారై యుండవలెనని యిచ్ఛయించుచున్నాడు. (1 తిమోతి 2:3,4)

• అయినను నేను ఆలస్యము చేసినయెడల దేవుని మందిరములో, అనగా జీవముగల దేవుని సంఘములో, జనులేలాగు ప్రవర్తింపవలెనో అది నీకు తెలియవలెనని యీ సంగతులను నీకు వ్రాయుచున్నాను. ఆ సంఘము సత్యమునకు స్తంభమును ఆధారమునైయున్నది. (1 తిమోతి 3:15)

• నన్ను నీ సత్యముననుసరింపజేసి నాకు ఉపదేశము చేయుము. నీవే నా రక్షణకర్తవైన దేవుడవు దినమెల్ల నీ కొరకు కనిపెట్టుచున్నాను. (కీర్తనలు 25:5)

• దేవుడు ఏర్పరచుకొనినవారి విశ్వాసము నిమిత్తమును, నిత్యజీవమునుగూర్చిన నిరీక్షణతోకూడిన భక్తికి ఆధారమగు సత్యవిషయమైన అనుభవజ్ఞానము నిమిత్తమును, దేవుని దాసుడును యేసుక్రీస్తు అపొస్తలుడునైన పౌలు, మన అందరి విశ్వాస విషయములో.. (తీతుకు 1:1,2)

• మీరు మీకు తెలియనిదానిని ఆరాధించువారు, మేము మాకు తెలిసినదానిని ఆరాధించువారము; రక్షణ యూదులలో నుండియే కలుగుచున్నది. అయితే యథార్థముగా ఆరాధించువారు ఆత్మతోను సత్యముతోను తండ్రిని ఆరాధించు కాలము వచ్చుచున్నది; అది ఇప్పుడును వచ్చేయున్నది; తన్ను ఆరాధించువారు అట్టివారే కావలెనని తండ్రి కోరుచున్నాడు. దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించు వారు ఆత్మతోను సత్యముతోను ఆరాధింపవలెననెను (యోహాను 4:22-24)

• కాబట్టి యేసు, తనను నమ్మిన యూదులతో మీరు నా వాక్యమందు నిలిచినవారైతే నిజముగా నాకు శిష్యులైయుండి సత్యమును గ్రహించెదరు; అప్పుడు సత్యము మిమ్మును స్వతంత్రులనుగా చేయును (యోహాను 8:31,32)

3. యదార్థమైన విశ్వాసులు దేవుని సత్యానికి ఎంతో విలువనిస్తారు.

సత్యమును అమ్మివేయక దాని కొనియుంచుకొనుము జ్ఞానమును ఉపదేశమును వివేకమును కొనియుంచుకొనుము. (సామెతలు 23:23)

• మేము సత్యమునకు విరోధముగా ఏమియు చేయనేరము గాని, సత్యము నిమిత్తమే సమస్తమును చేయుచున్నాము. (2 కొరింథీ 13:8)

• అయితే కుయుక్తిగా నడుచుకొనకయు, దేవుని వాక్యమును వంచనగా బోధింపకయు, సత్యమును ప్రత్యక్షపరచుటవలన ప్రతి మనుష్యుని మనస్సాక్షి యెదుట మమ్మును మేమే దేవుని సముఖమందు మెప్పించుకొనుచు, అవమానకరమైన రహస్యకార్యములను విసర్జించియున్నాము. (2 కొరింథీ 4:2)

• ప్రేమగలిగి సత్యము చెప్పుచు క్రీస్తువలె ఉండుటకు, మనమన్ని విషయములలో ఎదుగుదము. (ఎఫెసీ 4:15)

• మీరు పూర్వమందు చీకటియై యుంటిరి, ఇప్పుడైతే ప్రభువునందు వెలుగైయున్నారు. వెలుగు ఫలము సమస్తవిధములైన మంచితనము, నీతి, సత్యమను వాటిలో కనబడుచున్నది. (ఎఫెసీ 5:8,9)

• మీరు సత్యమునకు విధేయులవుటచేత మీ మనస్సులను పవిత్రపరచుకొనిన వారైయుండి, యొకనినొకడు హృదయపూర్వకముగాను మిక్కటము గాను ప్రేమించుడి. (1 పేతురు 1:22)

• దేవునియెదుట యోగ్యునిగాను, సిగ్గుపడనక్కరలేని పనివానిగాను, సత్యవాక్యమును సరిగా ఉపదేశించువానిగాను నిన్ను నీవే దేవునికి కనుపరచుకొనుటకు జాగ్రత్తపడుము. (2 తిమోతి 2:15)

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.