కారణం ఏదైనా కావొచ్చు, శ్రమల్లో ఉన్నప్పుడు, నిరుత్సాహం అనే గుంటలో పడటం చాలా సులభం.
సరైన దృక్పధం తిరిగి పొందటానికి, అందులో ఒక ఉద్దేశం చూడటానికి, కృతజ్ఞత కలిగుండటానికి, బాధలో నిరీక్షణతో ఉండటానికి, ఈ క్రింది మూడు సంగతులు మనకు సహాయం చేస్తాయి :
1. సవాళ్లు ఎదుర్కొంటున్న ఇతరులను గుర్తుచేసుకొని, వారి కొరకు ప్రార్ధించడం.
మనకు బాధ కలిగించే ఆలోచనలను, అలాంటి బాధల్లో ఉండే వారిని మనకు గుర్తుచేసి, వారి కోసం ప్రార్ధించడానికి ఒక జ్ఞాపకార్ధంగా ఉపయోగించుకోవచ్చు. అప్పుడు మన బాధ ఒక నిర్మాణాత్మకమైన ఉద్దేశాన్ని నెరవేర్చగలుగుతుంది. ఫిలిప్పీయులకు 2:3-4, రో్మీయులకు 12:15.
2. యేసు ప్రభువు పడిన ఘోరమైన శ్రమలను జ్ఞాపకం చేసుకొని, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి కొంత సమయం ఆయనతో గడపడం.
పరిస్థితులు బాగున్నప్పుడు ఎవరైనా కృతజ్ఞతలు చెల్లించడం చాలా సహజం. నిజమైన కృతజ్ఞత, కేవలం కష్టాల ద్వారానే నేర్చుకోగలం. కీర్తనలు 103.
3. జీవితం చాలా చిన్నదని, నిత్యత్వం అనంతమైనదని జ్ఞాపకం చేసుకోవాలి. మన శ్రమలు, దుఃఖం ఒకరోజు అంతమైపోతాయి. పూర్తిగా. ఎప్పటికీ. ఇదే మన తుది నిరీక్షణ. కొలస్సీయులకు 3:1-4.
ఈ మూడు జ్ఞాపికలు మన బాధను ఏమి తక్కువ చేయలేవు కాని, మనలను సరైన దృక్పధంలో ఐతే పెట్టగలవు. ఇవి మన సుదీర్ఘ ప్రయాణ మార్గానికి వెలుగులు చిమ్ముతూ, ఆ ప్రయాణానికి అవతల వెలుగు ఉంటుందని మనకు గుర్తుచేస్తాయి.
3 Ways to Keep Your Perspective During Difficulties
No comments:
Post a Comment
Note: Only a member of this blog may post a comment.