అతుక్కుపోయిన వాటిని ఏరడం...

ఎవ్వరూ నీ కష్టాన్ని గుర్తించట్లేదా? అయితే నిన్ను ప్రోత్సాహపరిచే ఈరోజు వాక్యధ్యానాన్ని చదువు!


అతుక్కుపోయిన.... వాటిని.... ఏరడం...


బుడాపెస్ట్ అనే స్థలంలో రోడ్డు పక్కలో ఉన్న స్థంభాలకు అతుక్కుపోయిన పాత చెత్త కాగితాలను అతను జాగ్రత్తగా ఒకదాని తరువాత ఒకటి ఏరుతున్నాడు.


ఆ సమయంలో నాకు ఇష్టమైన ఒక రెస్టారెంట్ లో నేను కూర్చొని రాసుకుంటున్నాను. అప్పుడే నేను కిటికీ అద్దంలో నుండి బైటకి చూసినప్పుడు, చెత్త కాగితాలను ఏరుతున్న ఆ వ్యక్తిని చూసాను.


బుడాపెస్ట్ లో నేను దాదాపు అయిదు సంవత్సరాలు ఉన్నా, ఇలాంటి ఎవ్వరూ మెచ్చుకోని పని చేస్తున్న వ్యక్తిని నేను గమనించడం ఇదే మొదటిసారి.


అమ్మకాలకు, కచేరీలకు, అద్దికిచ్చే స్థలాలకు ఇలా అనేకమైన వాటికి సంబంధించిన కరపత్రాలు రోడ్డుకి ఇరుప్రక్కలా ఉన్న స్థంభాలకు అతుక్కుపోయి ఉండటం నేను చూసాను. కాని వాటిని కూడా శుభ్రపరచేవారు ఉంటారని నేనెప్పుడూ ఆలోచించలేదు.


అతుక్కుపోయిన వాటిని ఏరడం, శుభ్రం చేయడం... ఇది ఎవ్వరూ ఎప్పుడూ గుర్తించని, కృతజ్ఞతలు చెప్పని, పట్టించుకోని, చూడని పని. అయినా ఆ వ్యక్తి తన పని తాను చేసుకుంటూనే ఉన్నాడు.


అతుక్కుపోయిన... వాటిని... ఏరడం...


అసలు ఈ పని చేస్తున్న నన్ను ఎవ్వరూ మెచ్చుకోరేంటి అని ఆ వ్యక్తి ఎప్పుడైనా ఆలోచించి ఉంటాడా అని నా ఆలోచన.


ఒకవేళ నువ్వు హోటల్లో ఆహారాన్ని అందించేవాడివేమో, లేక ఇంట్లో ఉండి పనులు చేసే తల్లివేమో, లేక సైనికుడివేమో, లేక ఒక మంచి పక్కింటివాడివేమో. నీ కష్టాన్ని, ప్రయాసను ఎవ్వరూ గుర్తించట్లేదు అనే సమయాలు నీ అనుభవంలో కూడా ఉన్నాయేమో.


కాని ఈరోజు నీకొక శుభవార్త చెప్పనా. దేవుడు నీ ప్రతీ కష్టాన్ని, నువ్వు పడే ప్రతీ ప్రయాసను గమనిస్తున్నాడు, గుర్తిస్తున్నాడు. కనుక :

"ప్రభువు వలన స్వాస్థ్యమును ప్రతిఫలముగా పొందుదుమని యెరుగుదురు గనుక, మీరేమి చేసినను అది మనుష్యుల నిమిత్తము కాక ప్రభువు నిమిత్తమని మనస్ఫూర్తిగా చేయుడి, మీరు ప్రభువైన క్రీస్తునకు దాసులైయున్నారు." (కొలొస్సయులకు 3:23-24)


అతుక్కుపోయిన... వాటిని... ఏరడం... చేస్తూనే... ఉంటాను...


నీవిచ్చిన వాగ్దానానికై నిండు వందనాలు ప్రభువా!


Scrape…Scrape…Scrape



ఎవ్వరూ నీ కష్టాన్ని గుర్తించట్లేదా? అయితే నిన్ను ప్రోత్సాహపరిచే ఈరోజు వాక్యధ్యానాన్ని చదువు!



No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.