తప్పుడు నమ్మకం, తప్పుడు అపరాధ భావం

సాధారణంగా క్రైస్తవులు రెండు తప్పుల్లో పడతారని దేవుని వాక్యం చెబుతుంది. అవి  రక్షణ గురించి తప్పుడు నమ్మకం, తప్పుడు భయాలు. ఈరోజు వాక్యధ్యాన వివరణలో తెలుసుకుందాం!


మనము దేవుని పిల్లలమని పిలువబడునట్లు తండ్రి మనకెట్టి ప్రేమననుగ్రహించెనొ చూడుడి; మనము దేవుని పిల్లలమే. ఈ హేతువు చేత లోకము మనలను ఎరుగదు, ఏలయనగా అది ఆయనను ఎరుగలేదు. (1 యోహాను 3:1)


• దేవుని పిల్లలంగా ఉండటం అంటే అర్ధం ఏమిటి?


1 యోహాను 3 చెబుతుంది నిజమైన దేవుని పిల్లలు అలవాటుగా పాపాలను చేసుకుంటూ పోవడాన్ని తృణీకరిస్తారు అని. వారు తమ పాపాలను ఒప్పుకుంటూ, వాటి గురించి పశ్తాత్తాపపడుతూ మంచి మనస్సాక్షి కోసం ప్రయాసపడతారు. క్రీస్తులో సహోదరి సహోదరులను నిజాయితీగా ప్రేమిస్తారు.


సాధారణంగా రెండు రకాలుగా విశ్వాసులు మోసపోతారు :


1. ఒకసారి క్షమించబడ్డాక, వారు ఇంక ఎన్ని పాపాలు చేసినా ఏం పర్వాలేదు అనుకుంటారు.


• కాని అది నిజం కాదు.


రక్షింపబడిన వారు వారి పాపాలు గురించి చాలా తీవ్రంగా పట్టించుకుంటారని దేవుని వాక్యం చెబుతుంది (యోహాను 14:21; రోమా 2:13; 1 యోహాను 3:6-10).


2. దేవుని వెంబడించాలి అని యదార్ధంగా తీర్మానించుకున్నా, దేవుని కృపను, క్షమాపణను అనుమానిస్తారు.


క్రైస్తవులకు పాత పాపాలను గుర్తుచేసి, దేవుని కృపను, క్షమాపణను అనుమానించేలా చేయడం అంటే అపవాదికి చాలా ఇష్టం. నేను ఎందుకూ పనికిరాను అనే విచారకరమైన ఆలోచనలకు కూడా గురిచేస్తాడు. దేవుడు గనుక పాపాలను ఒప్పింపచేస్తే, అది నిర్మాణాత్మకంగా, ఉద్దేశపూర్వకంగా ఉంటుంది (2 కొరింధీ 7:9,10).


మనం ప్రభువుకు చెందినవారమైతే, ఒక ఉజ్జీవ సభలో ముందుకు పిలిచినప్పుడు ముందుకు వెళ్ళి చెప్పే ఆ కొన్ని మాటలకే అది పరిమితం కాదు గాని, అది మన హృదయంలో, మనసులో, ప్రవర్తనలో ఒక భాగం అయిపోతుందని 1 యోహాను 3 లో దేవుని వాక్యం మనకు భరోసా ఇస్తుంది (1 కొరింధీ 4:20). అలాగని ఒక్కసారిగా మనం ఏ లోపం లేనివారముగా అయిపోతామని కాదుగాని, ప్రభువును సంతోషపెట్టాలనే ఆశతో పాపాలను విసర్జిస్తూ ఉంటామని అర్ధం (ఎఫెస్సీ 5:10).


False Confidence & False Guilt


సాధారణంగా క్రైస్తవులు రెండు తప్పుల్లో పడతారని దేవుని వాక్యం చెబుతుంది. అవి  రక్షణ గురించి తప్పుడు నమ్మకం, తప్పుడు భయాలు. ఈరోజు వాక్యధ్యాన వివరణలో తెలుసుకుందాం!


No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.