కొన్నిసార్లు లేఖనాలు వ్రాయబడిన వరుసల మధ్యల్లో చాలా పెద్ద కధలే ఇమిడి ఉన్నాయి. ఉదాహరణకు మొదటి కొరింధీయులకు వ్రాసిన పత్రికలో పౌలు సోస్తెనేసు అనే ఒక క్రైస్తవ సహోదరుని గురించి వ్రాస్తాడు.
అసలు సోస్తెనేసు ఎవరు?
అపొస్తలుల కార్యములు 18 లో, కొరింథీ పట్టణంలో పౌలు సువార్త ప్రకటిస్తున్నాడన్న ఆగ్రహంతో అక్కడున్న యూదా మత నాయకులు, అతన్ని శిక్షించాలని అధిపతి దగ్గరకు తీసుకెళ్తారు.
కాని అక్కడున్న గ్రీకు గుంపు, యూదుల మతోన్మాదం వలన విసిగిపోయి, వారిలో ఉన్న ఒక యూదా నాయకుణ్ణి కొడతారు... అతనే సోస్తెనేసు.
తరువాత ఏమి జరిగిందో లేఖనంలో చెప్పబడలేదు కాని తన శత్రువైన సోస్తెనేసుకు పౌలు సహాయం చేయుట ద్వారా కీడుకు మేలు చేసాడు (రో్మీయులకు 12:21).
అప్పుడు క్రీస్తును ద్వేషించే సోస్తెనేసు, క్రీస్తును వెంబడించే వ్యక్తిగా మారిపోయాడు.
ఇది నమ్మలేని నిజంగా అనిపించినా, ఇది గుర్తుంచుకో :
పౌలు, అపొస్తులుడుగా క్రీస్తును నిర్మొహమాటంగా ప్రకటించే ముందు, క్రైస్తవులను ద్వేషించడంలో నిర్మొహమాటంగా మాట్లాడేవాడు.
లీ స్ట్రోబెల్ అనే ఒక పత్రికా విలేఖరి క్రైస్తవ్యం నమ్మదగినది కాదని నిరూపించాలనే ఉద్దేశంతో తన ప్రయత్నం మొదలుపెట్టినా, అది ఎంత నిజమైనదో నిక్కచ్చి కలిగినదో వ్రాయడంతో అతని ప్రయత్నం ముగిసింది.
ప్రతీరోజు యేసు ప్రభువు మత్తుమందులకు అలవాటుపడిన వారిని, తాగుబోతులను, వ్యభిచారం చేసే వారిని, హంతకులను, వెర్రివారైన స్వనీతిపరులను, లోకంలో మేధావులను, అలాగే సాధారణ పాపులను దేవుని బిడ్డలుగా మారుస్తూనే ఉన్నారు (1 యోహాను 3:1).
ఇది నమ్మలేని నిజంగా అనిపించినా, మనం సేవించేది అలాంటి దేవుణ్ణే!
No comments:
Post a Comment
Note: Only a member of this blog may post a comment.