ఆహారం మన జీవితానికి అవసరమైన ముఖ్య భాగం... కాని అది మన ఆత్మీయ మరణానికి కూడా ఒక భాగమే అని గుర్తించాలి.
ఏదేను వనములో తినకూడని పండు ఆపిల్ అని మనం సాధారణంగా అంటాము కాని వాక్యభాగంలో అలా వ్రాయబడలేదు. మనకు తెలిసినది ఏమిటంటే అది మంచి చెడులు తెలివినిచ్చు చెట్టు నుండి వచ్చినదని, ఆ ఒక్క పండే ఆదాము అవ్వలు తినకూడనిదని.
ఆశ్చర్యం ఏమిటంటే, దేవుడు అబద్దికుడు, ఆ తినకూడని పండు తినడం వల్ల ఆమెకు ఎటువంటి నష్టం లేదు అని అవ్వతో అపవాది చెప్పినప్పుడు, ఆమె ఆ మాటలు నమ్మి, తినేసింది. అది తినడం వల్ల ఆమెకు జ్ఞానం వచ్చి దేవునిలాగ అయిపోతుందని కూడా అపవాది చెప్పాడు (ఆదికాండము 3).
కనుక :
• జ్ఞానానికి బదులు అభద్రత, అపరాధ భావం, శ్రమను ఆమె మింగింది.
• ఆమెలో ఉన్న దేవుని స్వరూపాన్ని పెంచుకోవడం బదులు, దానిని బలహీనపరిచింది.
• దేవుని సత్యం బదులు, అపవాది అసత్యాలు పోషణగా తీసుకుంది.
విచారం ఏమిటంటే, ఆ "ఆపిల్" మీద నా పండ్ల గాట్లు కూడా ఉన్నాయి. నీ పండ్ల గాట్లు కూడా ఉన్నాయి. ఎందుకంటే "అందరం పాపం చేసి దేవుడిచ్చే మహిమను పొందలేకపోయాము" (రోమా 3:23)(1)
కాని ఆ మరణకరమైన గాటు నుండి ఇంకా అపవాది యొక్క ప్రతీ అసత్యాల నుండి యేసు క్రీస్తు ప్రభువు మనలను విమోచించాడు.
ఈరోజు తీసుకోబోయే ప్రతీ నిర్ణయం ముందు, దేవుని సత్యంలో నుండి కొరుక్కుందామా!
------------------------
(1) మనమందరం నిర్ణయం ప్రకారం పాపులమే. ఈ ప్రకృతి ద్వారా దేవుడు తన ఉనికిని ఎంతో స్పష్టమైన ఆధారాలతో చూపించాడు కాబట్టి మనం తప్పించుకోలేం (రోమా 1:18-20). సువార్తను వినక ముందే, పుట్టుకతోనే దేవుని వైపు నడిపించే మనస్సాక్షిని మనం కలిగి ఉన్నాం (రోమా 2:14,15). ఈ ఆధారాలను మనం నిర్లక్ష్యం చెయొచ్చు, మనస్సాక్షిని అణచివేయొచ్చు లేక దేవుని ప్రేమకు స్పందించవచ్చు.
My Teeth Marks Are On That Apple
No comments:
Post a Comment
Note: Only a member of this blog may post a comment.