దేవుడు మన నుండి 'అసాధ్యాన్ని' అడుగుతాడు

రో్మీయులకు 12 లో దేవుడు మన నుండి 'అసాధ్యాన్ని' అడుగుతున్నాడు. ఈరోజు వాక్యధ్యానం దీనినే వివరిస్తుంది!


దేవుడు "అసాధ్యాన్ని" అడుగుతాడు - మన శక్తి, సామర్ధ్యాలకు మించిన కార్యాలకు, దేవుని శక్తి ద్వారానే సాధ్యపడే కార్యాలకు పిలుస్తాడు.


రో్మీయులకు 12:14-21 లో ఉన్న, మనకు "అసాధ్యమైన" ఆజ్ఞలను చూద్దాం :

మిమ్ములను హింసించే వారిని దీవించండి.


• కీడుకి ప్రతికీడు ఎవనికి చేయవద్దు.


• శత్రువుకు ఆకలి వేస్తే భోజనం పెట్టు.


• మేలు చేత కీడును జయించు.


నిన్ను ఎవరైనా లోతుగా గాయపరిచారా? నీ గురించి ఇతరులకు అబద్దాలు చెప్పి, నీకెంతో నష్టాన్ని కలిగించారా? ఉద్దేశపూర్వకంగా, నీ నష్టం ద్వారా వారు లాభం పొందారా?


అయితే, ఆ వ్యక్తిని దీవించడానికి ఈరోజు కొంత సమయం తీసుకో.


అన్ని సమయాల్లో తగిన మార్గం, వారిని దీవించగలిగే ఆ మార్గం ఏమిటంటే, వారి కొరకు ప్రార్ధించడం.


కొన్నిసార్లు దేవుడు ఇంకా ఏదైనా చేయమని అడగొచ్చు. వారికి ఏదైనా అవసరం వస్తే సహాయం చేయడం, లేకపోతే దయతో కూడిన ఏదైనా కార్యం చేయడం వంటివి.


మనకు శక్తి లేకపోయినా, కొలతలేని శక్తి ఉన్న దేవుణ్ణి అడిగితే, కీడును మేలుతో జయించే శక్తిని బలాన్ని ఆయనే ఇస్తాడు. మన శత్రువు హృదయంలో ఉన్న కీడు బుద్దిని మనం తీసివేయలేకపొచ్చు కాని, దేవుని శక్తి ద్వారా మన హృదయంలో అదే బుద్ది ఆక్రమించకుండా ఉండే జయాన్ని కూడా పొందగలం!


God Asks Us to Do the Impossible


రో్మీయులకు 12 లో దేవుడు మన నుండి 'అసాధ్యాన్ని' అడుగుతున్నాడు. ఈరోజు వాక్యధ్యానం దీనినే వివరిస్తుంది!


No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.