"క్రైస్తవ కర్మ" అనే కొత్త సిద్ధాంతాన్ని వారు స్వీకరించినట్టు కొంతమంది క్రైస్తవులు గుర్తించలేకపోతున్నారు.
మంచి వారికి చెడు (ఉదా: యోసేపు, అపో. పౌలు), చెడ్డ వారికి మంచి జరగడం సాధారణం అని గుర్తించాల్సింది బదులు, ప్రతీ సమస్య పాపంతోనే ముడిపడి ఉందని వారి ఆలోచన.
యోబు స్నేహితులులాగా వారు ఆ సమస్యలు పొందడానికి ఏదోరకంగా అర్హులై ఉంటారని వారి ఆలోచన.
ఇది నిజంగా వాక్యానుశారమైనది కాదు. ఎవరైతే శ్రమలగుండా వెళ్తున్నారో, వారిపై అన్యాయంగా బరువును మోపడం వంటిదే ఈ ఆలోచన. పాపానికి సమస్యకు స్పష్టమైన సంబంధం ఉన్న ఉదాహరణలు ఒకటి (ఉదా: త్రాగుబోతుకు లివర్ పాడవ్వడం లేక వ్యభిచారం చేసిన యవ్వనురాలు గర్భిణి కావడం). కాని ఎటువంటి స్పష్టమైన సంబంధం లేకపోయినా, శ్రమల్లో ఉన్న వ్యక్తులను తీర్పు తీరిస్తే అదే "క్రైస్తవ కర్మ" అవుతుంది.
యోహాను 9:2,3 లో అనారోగ్యం ఎప్పుడూ పాపం వల్లే వస్తుందని శిష్యులు అనుకున్నప్పుడు, యేసు ప్రభువు వారిని సరిచేశారు. బ్రతికి బయటపడి జీవిస్తున్న వారు ఎంత అర్హులో, రాజకీయ పరిస్థితుల వల్ల వధింపబడిన వారు, గోపురం పడి చచ్చిన వారూ అంతే అర్హులని, లూకా 13:1-5 లో యేసు ప్రభువు చెప్పారు.
గలతీ 6:7-8 లో మనిషి ఏది విత్తితే ఆ పంటనే కోస్తారని వ్రాయబడింది. కాని ఇది కర్మ సిద్ధాంతంలాగ కాదు, దేవుడు అటువంటి న్యాయం ఇక్కడే ఈ భూమిపై ఉండగానే ఇస్తానని వాగ్దానం చేయలేదు (1 థెస్సలొనిక 1:6-7) అంతేకాదు, నీతిగా జీవించే వారికి ఈ భూమిపై ఏ సమస్యలు ఉండవు అని కూడా దేవుడు వాగ్దానం చేయలేదు (యోహాను 16:33).
మనం పూర్తిగా క్రైస్తవులంగా ఉందాం. క్రైస్తవ్యాన్ని హిందుత్వాన్ని కలపడం విడిచిపెడదాం (కొలస్సీ 2:8).
Christianity and Karma are not Compatible
No comments:
Post a Comment
Note: Only a member of this blog may post a comment.